Prabhas: పెళ్లి వేడుకలో తళుక్కుమన్న ప్రభాస్ సిస్టర్స్.. డార్లింగ్ మ్యారేజ్‌పై మళ్లీ మొదలైన చర్చ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున ప్రభాస్ పేరు చెబుతారు. డార్లింగ్ పెళ్లి కోసం అతని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభాస్ పెళ్లి విషయం మరోసారి తెరమీదకు వచ్చింది.

టాలీవుడ్ హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెడుతుంటే ప్రభాస్ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతున్నాడు. సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. ప్రభాస్ పెళ్లి కోసం అతని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టాలీవుడ్ లో తరచూ ఏదో ఒక సందర్భంలో ప్రభాస్ పెళ్లి టాపిక్ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. అలా తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది. అందుకు కారణం.. తాజాగా ఒక పెళ్లి వేడుకలో ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లతో పాటు కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కనిపించడం. బంధువుల పెళ్లి వేడుకకు ప్రభాస్ పెద్దమ్మతో శ్యామల దేవితో పాటు ఆమె ముగ్గురు కుమార్తెలు ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి కూడా హాజరయ్యారు. భాగంగా అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు. అనంతరం పెళ్లి వేడుక ఫోటోలను ప్రసీద్ ఉప్పలపాటి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో అవి కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ప్రభాస్ అభిమానులు లైక్స్ షేర్ల వర్షం కురిపించారు. ‘ప్రభాస్ అన్నకు త్వరగా పెళ్లి చేయండి సిస్టర్స్’ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో మరోసారి నెట్టింట ప్రభాస్ పెళ్లిపై చర్చ మొదలైంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తున్నాడు. ముందుగా ‘దిరాజా సాబ్’, విడుదల కానుంది. ఆ తర్వాత హను రాఘవపడి పౌజి సినిమా, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, ‘సాలార్ 2’ ,కల్కి 2 సినిమాలు చేయనున్నాడు. కాగా ఇటీవల హోంబాలే నిర్మాణ సంస్థలో మూడు సినిమాల్లో నటించేందుకు ప్రభాస్ ఒకే చెప్పాడు.
పెళ్లి వేడుకలో శ్యామలా దేవితో ప్రభాస్ సిస్టర్స్..
View this post on Instagram
కల్కి ఈవెంట్ లో సోదరీమణులతో ప్రభాస్..
Our darling #Prabhas with his sisters and @diljitdosanjh on sets of #KALKI2898AD #KALKI2898ADOnJune27th pic.twitter.com/H2ksaZdlMo
— Prabhas Fans (@Team_Prabhas) June 17, 2024
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.