Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udaya Bhanu-Nara Brahmani: ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. వీడియో ఇదిగో

యాంకర్ ఉదయభానుకి నందమూరి బాలకృష్ణ అంటే చాలా అభిమానం. బాలయ్య తనకు చాలా సందర్భాల్లో సాయం చేశారంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది ఉదయ భాను. ఇక తాజాగా బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి తన బిడ్డలకి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించారంటూ ఎమోషనల్ అయ్యిందీ యాంకరమ్మ.

Udaya Bhanu-Nara Brahmani: ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. వీడియో ఇదిగో
Nara Brahmani, Udaya Bhanu
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2025 | 10:50 PM

తెలుగు ఆడియెన్స్ కు ఉదయ భాను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిందీ అందాల యాంకరమ్మ. వన్స్ మోర్ ప్లీజ్, రేలా రె రేలా, ఢీ , సాహసం చేయరా డింభకా, నువ్వు నేను.. ఇలా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌తో బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటించి అలరించింది. అయితే గత కొన్నేళ్లుగా అన్నింటికీ దూరంగా ఉంటోంది ఉదయ భాను. అయితే ఈ మధ్యనే మళ్లీ కొన్ని టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లలో సందడి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోన్న ఆమె తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటంటే.. బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి తన కూతుర్లకి ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించిందట. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను షేర్ చేసింది ఉదయ భాను. అందులో ‘ఒక స్పెషల్ పర్సన్ మీకు ఈ గిఫ్ట్ పంపించారు. బాలయ్య మామ అంటే ఎవరికీ ఇష్టం ఇక్కడ” అంటూ తన కవల పిల్లల్ని అడిగింది ఉదయ భాను. మాకిష్టం అంటూ ఇద్దరూ చేతులెత్తారు. దీంతో మీకు ఎంతో ఇష్టమైన వయోలిన్ పంపించారు అంటూ ఆ వయోలిన్‌ని తన కూతుళ్లకు ఇచ్చింది ఉదయభాను. ఇది చూసి ఆ ఇద్దరి పిల్లలు సర్‌ప్రైజ్ అయ్యారని, అందుకు థ్యాంక్యూ బాలయ్య మామ అని చెప్పారంది యాంకరమ్మ. ఇక ఉదయ భాను కూడా బాలయ్య, బ్రాహ్మణికి ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పింది.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ముఖ్యంగా నందమూరి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా పలు వేదికలపై బాలయ్యపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది ఉదయ భాను. వివిధ సందర్బాల్లో తాను అడగ్గానే బాలయ్య సాయం చేశారని ఉదయభాను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన బిడ్డల పుట్టినరోజు నాడు ఒక్క మెసేజ్ చేస్తే బాలయ్య అతిథిగా వచ్చారంటూ ఉదయభాను గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటి బాలయ్య ఇప్పుడు బాలయ్య బిడ్డ నారా బ్రాహ్మణి తన కూతుర్లకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఉదయభాను తెలిపింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఇద్దరు కూతుళ్లతో యాంకర్ ఉదయ భాను..

View this post on Instagram

A post shared by Udaya Bhanu (@iamudayabhanu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..