Spirit Movie: ప్రభాస్‌తో కలిసి నటించాలనుకుంటున్నారా? స్పిరిట్ కాస్టింగ్ కాల్ డీటెయిల్స్ ఇదిగో
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలో నటించాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారికి 'స్పిరిట్' చిత్ర బృందం ఒక మంచి అవకాశం కల్పిస్తోంది. దీని గురించి స్పిరిట్ మూవీ నిర్మాణ సంస్థ 'భద్రకాళి పిక్చర్స్' సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సలార్, ‘కల్కి 2898 AD’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం అతను చేతిలో అరడజను సినిమాలున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ‘స్పిరిట్’ చిత్రంలో కూడా నటించనున్నాడు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కాబట్టి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని చిత్ర బృందం పంచుకుంది. ‘స్పిరిట్’ చిత్రాన్ని ‘భద్రకాళి పిక్చర్స్’ ‘టి సిరీస్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆడిషన్ల గురించిన వివరాలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఫిలిం లేదా థియేటర్ బ్యాగ్రౌండ్ ఉన్న యాక్టర్స్ ను మాత్రమే తీసుకోబోతున్నట్లు చెప్పారు. రెండు ఫోటోలను, 2 నిమిషాల ఇంట్రడక్షన్ వీడియోలను అఫిషియల్ మెయిల్ ఐడీ spirit.bhadrakalipictures@gmail.com కి పంపించాలని సూచించారు. ఇంట్రడక్షన్ వీడియోలో పేరు, ఎడ్యుకేషన్, అనుభవం వంటి వివరాలు తెలియజేయాలని సూచించారు. ఈ మేరకు భద్రకాళి పిక్చర్స్ సంస్థ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాలకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్, డిమాండ్ ఉంది. కాబట్టి ‘స్పిరిట్’ కూడా పాన్ ఇండియా సినిమా అవుతుంది. అన్ని భాషల నుండి ప్రముఖ కళాకారులు నటించే అవకాశం ఉంది. కొత్త కళాకారులకు అవకాశం ఇవ్వడం కూడా మంచి విషయం. చాలా మంది ప్రభాస్ నటిస్తున్న సినిమాలో కూడా నటించాలని కోరుకుంటారు. అలాంటి వారు తమ కలలను నిజం చేసుకోవడానికి ఇది సరైన అవకాశం. మరెందుకు లేటు వెంటనే ఈ అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోండి.
2 నిమిషాల వీడియోను జత చేసి..
We’re calling all aspiring actors for an exciting casting opportunity in our film, “Spirit”. pic.twitter.com/DgLZ5kIvNO
— Bhadrakali Pictures (@VangaPictures) February 12, 2025
పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్..
#Prabhas Will Be Seen In more Than 2 Diffrent Looks in #Spirit As Per The Sources
That’s Why both Director & Hero Want To Focus One & Only Spirit Till The Movie Is Completed #SandeepReddyVanga pic.twitter.com/eGXeTTvIJI
— Hemanth Kumar Pedhiredla ⍟ (@BelieverHemanth) January 31, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.