- Telugu News Photo Gallery Cinema photos Neha Shetty shared latest dazzling photos in yellow dress goes viral
Neha Shetty: ఈ సుకుమారి సొగసును చూసి వెన్నల చిన్నబోదా.. డేజ్లింగ్ నేహా..
నేహా శెట్టి.. ఈ పేరు కంటే రాధిక అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి 2016లో కన్నడ చిత్రం ముంగారు మలే 2తో తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
Prudvi Battula | Edited By: Shaik Madar Saheb
Updated on: Feb 12, 2025 | 10:39 PM

5 డిసెంబర్ 1999న కర్ణాటకలోని మంగళూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ నేహా శెట్టి. పెరిగింది మాత్రం బెంగుళూరులోనే. ఆమె తల్లి దంతవైద్యురాలు, ఆమె తండ్రి వ్యాపారవేత్త మరియు ఆమెకు ఒక చెల్లెలు కూడా ఉంది.

ఆకాష్ పూరి హీరోగా కనిపించిన ‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నేహ శెట్టి.. ఆ తర్వాత సందీప్ కిషన్ సరసన 'గల్లీ బాయ్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

అయితేనేం సరిగ్గా ఐదేళ్ల తర్వాత డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టింది. రాధిక పాత్రలో నేహ శెట్టి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ పాత్ర ఆమెకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. డీజే టిల్లు బ్లాక్‌బస్టర్‌తో నేహ శెట్టికి వరుసగా అవకాశాలు వచ్చాయి.

2023లో కామెడీ డ్రామా చిత్రం 'బెదురులంక 2012'లో కార్తికేయకి జోడిగా నటించి మరో హిట్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. అదే ఏడాది కిరణ్ అబ్బవరంకి జోడిగా 'రూల్స్ రంజన్' సినిమాలో కథానాయకిగా నటించింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

2024లో వచ్చిన సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్‌లో మరోసారి రాధికగా అదితి పాత్రలో ఆకట్టుకుంది. తర్వాత విశ్వక్సేన్ సరసన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది.





























