Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs GG, WPL 2025: 202 రన్స్ ఉఫ్.. భారీ లక్ష్యాన్ని ఛేదించి బోణీ కొట్టిన బెంగళూరు

WPL 2025 ప్రారంభ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగింది. ఇందులో డిపెండింగ్ ఛాంపియన్ బెంగళూరు జట్టు 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. తద్వారా డబ్యూపీఎల్-2ం25 టోర్నమెంట్ లో ఆ జట్టు బోణీ కొట్టింది.

RCB vs GG, WPL 2025: 202 రన్స్ ఉఫ్.. భారీ లక్ష్యాన్ని ఛేదించి బోణీ కొట్టిన బెంగళూరు
RCB vs GG, WPL 2025
Follow us
Basha Shek

|

Updated on: Feb 15, 2025 | 6:05 AM

WPL 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. అయితే చివరకు విజయం బెంగళూరు జట్టు నే వరించింది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లోనే మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరును ఛేదించడం ద్వారా బెంగళూరు జట్టు సంచలనం సృష్టించింది. 202 పరుగుల చారిత్రాత్మక ఛేదనలో ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ , కనికా అహుజా కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురు బ్యాటర్ల దూకుడుతో ఆర్‌సిబి 202 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. గత 2 సీజన్లలో ఇంత పెద్ద స్కోరును ఎప్పుడూ ఏ జట్టు ఛేజ్ చేయలేదు. శుక్రవారం (ఫిబ్రవరి 14వ తేదీ) గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జట్టు కెప్టెన్ ఆష్లే గార్డనర్ తుఫాను ఇన్నింగ్స్ సహాయంతో 201 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈ భారీ స్కోరును ఛేదించే క్రమంలో ఆర్‌సిబి కేవలం 14 పరుగులకే తమ ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయింది. కానీ దీని తర్వాత ఎల్లీస్ పెర్రీ క్రీజులోకి వచ్చింది. తన పవర్ ఫుల్ హిట్టింగ్ తో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించింది.

రాఘవి బిష్ట్ (25) తో కేవలం 54 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది ఫెర్రీ. ఇక 13వ ఓవర్లో, మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న పెర్రీ (34 బంతుల్లో 57) కూడా పెవిలియన్‌కు. దీని తరువాత రిచా ఘోష్ గెలుపు బాధ్యతలు తీసుకుంది. ఆలిస్ పెర్రీ ఔట్ తర్వాత, RCB మరోసారి కాస్త తడబడినట్లు అనిపించింది. జట్టు విజయానికి కేవలం 46 బంతుల్లో 93 పరుగులు అవసరం. కానీ రిచా ఘోష్ అస్సలు భయపడలేదు. ఆమె గుజరాత్ జెయింట్స్ బౌలర్లను చిత్తు చేసి కేవలం 27 బంతుల్లో 237 స్ట్రైక్ రేట్‌తో 64 అజేయంగా పరుగులు చేసింది. ఇందులో 4 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ పరుగుల వేటలో, కనికా అహుజా కూడా రిచాకు చాలా మద్దతు ఇచ్చింది. ఆమె కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసింది. ఈ విధంగా, RCB తన ముగ్గురు బలంతో WPL చరిత్రలో అత్యధిక స్కోరును ఛేదించడం ద్వారా చరిత్ర సృష్టించింది. తన మెరుపు ఇన్నింగ్స్‌కు రిచా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..