Suriya: సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు.. అగరం ఫౌండేషన్ కార్యక్రమంలో సూర్య
కోలీవుడ్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.డైరెక్టర్ ఆర్జే బాలాజీ దర్శక్తవంలో ఓ భారీ యాక్షన్ అడ్వైంచరస్ మూవీ రూపొందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ త్రిషను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. చివరిగా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు సూర్య నెక్స్ట్ సినిమా పై అభిమానులు భారీ హైప్ క్రియాట్ అయ్యింది. ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సూర్య 44 లేదా.. రెట్రో చిత్రంలో సూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ సినిమాను మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత, దర్శకుడు, నటుడు ఆర్.జె. బాలాజీ దర్శకత్వం వహిస్తున్న సూర్య 45వ చిత్రంలో నటిస్తున్నాడు
ఇదిలా ఉండగా, నటుడు సూర్య అగరం ఫౌండేషన్ అనే విద్యా స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నిన్న(ఆదివారం) చెన్నైలో అగరం ఫౌండేషన్ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవానికి సూర్య హాజరయ్యారు. విద్య, దాని గొప్పతనం గురించి సూర్య చాలా అద్భుతంగా మాట్లాడారు. సూర్య కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కొత్త కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి హాజరైన సూర్య మాట్లాడుతూ. “నేను నా సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇంత ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. కానీ ఈ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే, నేను ఈ భవనాన్ని విరాళాల డబ్బుతో నిర్మించలేదు, నా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ కొత్త కార్యాలయాన్ని నిర్మించాను.
దాతలు ఇచ్చే డబ్బు పూర్తిగా విద్యకే ఖర్చు అవుతుందని సూర్య అన్నారు. విద్యయే దేవుడు అని, విద్య ఎవరికైనా ఒక కవచం అని సూర్య తెలిపారు. ఫిబ్రవరి 16న చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి సూర్య తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఆయన తన కుమారుడు దేవ్, కూతురు దియా, భార్య జ్యోతికతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన వీడియో వైరల్ అవుతోంది.
టీవీ9 తమిళ్ సోర్స్ : (Suriya: “கல்வியே ஆயுதம்”.. அகரம் அறக்கட்டளை விழாவில் சூர்யா பேச்சு!)
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి