Sivakarthikeyan: శివకార్తికేయన్ వర్కౌట్స్.. సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో చూడండి
హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. తమిళ్ లో హీరోగా రాణిస్తున్న శివ కార్తికేయన్. రెమో, వరుణ్ డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. అలాగే తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ప్రిన్స్ సినిమాతో తెలుగులోకి నేరుగా అడుగుపెట్టాడు. ఈ సినిమా తమిళ్, తెలుగు రెండు భాషల్లో విడుదలైంది.

యాంకర్ గా ప్రేక్షకులను ఆకట్టుకొని ఆతర్వాత సినిమాల్లో ఛాన్స్ లు అందుకొని ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్. తమిళ్ లో హీరోగా రాణిస్తున్న శివ కార్తికేయన్. రెమో, వరుణ్ డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. అలాగే తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ప్రిన్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరయ్యాడు. ఇక రీసెంట్‌గా అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు శివ కార్తికేయన్ నెక్స్ట్ మూవీ పై హైప్ క్రియేట్ అయ్యింది. శివకార్తికేయన్ ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మదరాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఇది..! ఎలా ఉన్న హీరోయిన్ ఎలా మారిపోయింది..!! అస్సలు గుర్తుపట్టలేదు గురూ..!
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మదరాసి సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్ లో శివకార్తికేయన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అమరన్ సినిమా కోసం శివకార్తికేయన్ బాడీ ఎలా బిల్డ్ చేశాడో చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమరన్ సినిమా తమిళనాడుకు చెందిన మాజీ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే..
ఇది కూడా చదవండి : చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయింది.. ప్లాట్ ఫామ్ మీద నిద్రపోయింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్
ఈ సినిమా కోసం నటుడు శివకార్తికేయన్ చాలా కష్టపడ్డాడు., అమరన్ చిత్రం కోసం శివ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. అమరన్ సినిమా కోసం శివకార్తికేయన్ చాలా కఠినమైన వ్యాయామాలు అలాగే ఫుడ్ డైట్ తీసుకున్నారు. అమరన్ సినిమాలో శివకార్తికేయన్ కాలేజీ స్టూడెంట్ గా అలాగే మేజర్ ముకుంద్ పాత్రలో వేరియేషన్స్ కనబరిచారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శివ మాట్లాడుతూ.. తాను మొదట బరువు తగ్గానని, క్రమంగా టోన్డ్ బాడీని బిల్డ్ చేసుకున్నాను అని తెలిపాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.
సోర్స్ టీవీ 9 తమిళ్ ( Sivakarthikeyan: அப்படி ஒரு உழைப்பு.. அமரன் படத்திற்கு சிவகார்த்திகேயன் செய்த சம்பவம்!)
ఇది కూడా చదవండి :25 సినిమాలు చేస్తే అందులో 5 హిట్లు.. కట్ చేస్తే నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా..
Pain of #Sivakarthikeyan during his physical transformation !!
Now all that resulted as success in #Amaran❤️🔥 pic.twitter.com/aPhJmtxM8R
— AmuthaBharathi (@CinemaWithAB) February 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







