Adipurush: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా బాడ్ న్యూసే.. ఆదిపురుష్ విషయంలో మరోసారి ఇలా

ఎప్పుడెప్పుడు డార్లింగ్ ను రాముడిలా.. సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామనకున్న ఫ్యాన్స్ కు ఇది.. షాకిచ్చే న్యూస్. అదే ఆదిపురుష్ సినిమా రిలీజ్ వాయిదా పడిందనే న్యూస్.

Adipurush: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇది  నిజంగా బాడ్ న్యూసే.. ఆదిపురుష్ విషయంలో మరోసారి ఇలా
Adipurush
Follow us

|

Updated on: Dec 18, 2022 | 7:15 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు బ్యాడ్‌ న్యూస్. ఎప్పుడెప్పుడు డార్లింగ్ ను రాముడిలా.. సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామనకున్న ఫ్యాన్స్ కు ఇది.. షాకిచ్చే న్యూస్. అదే ఆదిపురుష్ సినిమా రిలీజ్ వాయిదా పడిందనే న్యూస్. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరుకెక్కుతున్న సినిమా ఆదిపరుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ సెన్సార్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఈసినిమా… టీజర్ రిలీజ్ నుంచే నెట్టింట విపరీతంగా బజ్ చేస్తోంది. ట్రోల్స్ రూపంలో.. తెగ వైరల్ అవుతూనే ఉంది. దాంతో పాటే.. సినిమాపై బజ్‌ కూడా త్రూ అవుట్ ఇండియా ఓ రేంజ్లో ఫామ్‌ అవుతూనే ఉంది.

ఇక ఈ క్రమంలోనే జాన్ 12 న రిలీజ్ కావాల్సిన ఈసినిమా రిలీజ్‌ను ఉన్నట్టుంది వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకోవడం అందర్నీ షాక్ చేసింది. రాముడి. రావాణాసురిడి క్యారెక్టర్లకు రీషూట్‌ జరుతుందనే టాక్ బీ టౌన్‌లో వినిపించింది. ఆదిపురుష్ రిలీజవుతున్న జాన్ 12 రోజే.. బాలీవుడ్ బిగ్‌ స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయట. దీంతో ఈ సినిమాను జాన్ 12న కాకుండా మరో రోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట మేకర్స్ .

అయితే ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఆదిపురుష్ కంటే ముందే సాలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది. మొత్తంగా ఆదిపురుష్ సినిమా అనుకున్న తేదీకి రాదు అని టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి