KGF Star Yash: శబాష్ రాకీ భాయ్ అంటున్న నెటిజన్లు.. యశ్ చేసిన పనికి అంతా ఫిదా..

అప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఆయన క్రేజ్ ను దేశవ్యాప్తం చేసింది ఆ సినిమా.. ఇంతకు ఆ హీరో ఎవరు.. ఆ సినిమా ఏంటి.? అనుకుంటున్నారా అతనే కన్నడ రాకింగ్ స్టార్ యశ్.

KGF Star Yash: శబాష్ రాకీ భాయ్ అంటున్న నెటిజన్లు.. యశ్ చేసిన పనికి అంతా ఫిదా..
Rocking Star Yash
Follow us

|

Updated on: Dec 18, 2022 | 6:04 PM

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ఓవర్ నైట్ లో ఆ హీరో రేంజ్ ను మార్చేసింది. అప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఆయన క్రేజ్ ను దేశవ్యాప్తం చేసింది ఆ సినిమా.. ఇంతకు ఆ హీరో ఎవరు.. ఆ సినిమా ఏంటి.? అనుకుంటున్నారా అతనే కన్నడ రాకింగ్ స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటి వరకు ఉన్న రికార్డ్ లను కేజీఎఫ్ సినిమా బ్రేక్ చేసింది. ఈ సినిమాలో యశ్ యాక్టింగ్.. యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టాయి. కేజీఎఫ్ సినిమా తర్వాత యశ్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్2 సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా .యశ్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోలకు కలిసేందుకు ఫ్యాన్స్ రావడం వారితో సెల్ఫీలు దిగడం మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది హీరోలు ఓపిక నశించి సీరియస్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ యశ్ మాత్రం అలా చేయలేదు.

ఇవి కూడా చదవండి

తనను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరికి ఓపికగా సెల్ఫీలు ఇచ్చాడు. ఫ్యాన్స్ అంటే 10, 20 మంది కాదు.. ఏకంగా 700లమంది ఫ్యాన్స్ కు ఓపికగా సెల్ఫీలు ఇచ్చాడు. బెంగళూరులో ఒక ఈవెంట్ లో పాల్గొన్న యశ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు. అక్కడ సెక్యూరిటీ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ యశ్ మాత్రం వారిని ఆపి అందరితో ఫోటోలు దిగాడు. ఏకంగా ఏడువందలమందితో ఫోటోలు దిగి ఆశ్చర్య పరిచాడు. దాంతో రాకీ భాయ్ ఓపికకు.. ఫ్యాన్స్ కు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.