AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Grand Finale Highlights: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్.. రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్

Bigg Boss Telugu 6 Grand Finale Updates: ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 విన్ అవుతారు.

Bigg Boss 6 Grand Finale Highlights: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్.. రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్
Revanth
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2022 | 10:37 PM

Share

బిగ్ బాస్ సీజన్ 6 చివరి ఎపిసోడ్‌కు వచ్చేసింది ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఈ ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తేలిపోయింది.. రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ టాప్ 5లో నిలిచారు.. ఈ ఐదుగురిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు, సూట్ కేస్ తీసుకొని అమౌంట్ తో బయటకు ఎవరు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. హౌస్ లో ఉన్న వారిలో ఓట్ల ప్రకారం చూసుకుంటే రేవంత్ కు ఎక్కువ ఓటింగ్ ఉంది. కాబట్టి అతడే విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేవంత్ తర్వాత శ్రీహాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ ఇద్దరు బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడ్డారు.

బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే గ్రాండ్ గా జరిగింది. కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. నాగ్ ఎంట్రీ తర్వాత వరుసగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ డాన్స్ లతో అదరగొట్టారు. స్టెప్పులేసి అలరించిన అర్జున్ కళ్యాణ్, వాసంతి, సూర్య, ఫైమా, రాజ్, సుదీప, మరీనా, అభినయ, గీతూ రాయల్, ఆరోహి. అలాగే టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీలు కూడా వచ్చారు. మాజీ కంటెస్టెంట్స్ ను బాగా మిస్ అయ్యానని అన్నారు నాగ్. ఇక హౌస్ నుంచి రోహిత్, ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత రవితేజ హౌస్ లోకి వెళ్లి సందడి చేశారు. ఆ తర్వాత కీర్తిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు తీసుకు వచ్చేశారు. 40 లక్షలు తీసుకొని రన్నరప్ గా నిలిచిన శ్రీహాన్. విన్నర్ గా నిలిచిన రేవంత్. అయితే ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ టాప్ వన్ లో ఉన్నాడని నాగార్జున అనౌన్స్ చేశారు. కానీ 40లక్షలు తీసుకోవడానికి శ్రీహాన్ నిర్ణయించుకోవడంతో రేవంత్ విన్నర్ అయ్యాడు. ఇక సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రియల్ విన్నర్ అంటూ అనౌన్స్ చేశారు నాగ్ .

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Dec 2022 10:18 PM (IST)

    ఓటింగ్‌లో కూడా శ్రీహాన్ టాప్ వన్ : నాగార్జున

    ఆడియన్స్ ఓటింగ్ లో కూడా శ్రీహాన్ టాప్ వన్ లో ఉన్నాడని నాగార్జున అనౌన్స్ చేశారు. అలాగే హౌస్ లో సరైన నిర్ణయం తీసుకున్న రేవంత్ విన్నర్ అంటూ అనౌన్స్ చేశారు నాగార్జున.

  • 18 Dec 2022 10:09 PM (IST)

    బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్..

    అందరు ఊహించినట్టే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్ నిలిచాడు. ముందునుంచి దూకుడుగా గేమ్ ఆడుతూ.. టాక్స్ ల్లో తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రేవంత్. మొదటి నుంచి కప్పు గెలవాలన్న కసితో ఆడిన రేవంత్ ఎట్టకేలకు విన్నర్ అయ్యాడు.

  • 18 Dec 2022 10:01 PM (IST)

    బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్

    బిగ్ బాస్ సీజన్ 6లో విన్నర్ గా నిలిచిన రేవంత్..

  • 18 Dec 2022 10:00 PM (IST)

    40 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసిన శ్రీహాన్.. రేవంత్ విన్నర్

    హౌస్ లోకి వెళ్లిన కింగ్ నాగార్జున వెళ్తూ గోల్డెన్ బాక్స్ లో40 లక్షల మనీతో వెళ్ళాడు నాగ్. 40 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసిన శ్రీహాన్. రేవంత్ విన్నర్ గా నిలిచాడు.

  • 18 Dec 2022 09:26 PM (IST)

    మిగిలింది రేవంత్, శ్రీహాన్

    హౌస్ లో మిగిలింది రేవంత్, శ్రీహాన్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు విన్నర్, ఒకరు రన్నర్ కానున్నారు.

  • 18 Dec 2022 09:24 PM (IST)

    బిగ్ బాస్ నుంచి కీర్తి అవుట్

    బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు రవితేజ. సూట్ కేస్ ఆఫర్ తో హౌస్ లోకి వెళ్లిన రవితేజ లోపల ఉన్నవారిని టెంప్ట్ చేశాడు. కానీ మనీతో రావడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. ఆ తర్వాత రవితేజ కీర్తిని బయటకు తీసుకువచ్చారు

  • 18 Dec 2022 08:50 PM (IST)

    హౌస్ నుంచి బయటకు వచ్చేసిన ఆదిరెడ్డి

    బిగ్ బాస్ నుంచి టాప్ నుంచి టాప్ 3 అయ్యారు. మాస్ మహారాజా, శ్రీలీల సమక్షంలో ఎలిమినేషన్ చేశారు నాగార్జున. ఈ టాస్క్ లో ఆదిరెడ్డి అవుట్ అయ్యాడు. ఈ  బిగ్ బాస్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఆదిరెడ్డి  బయటకు వచ్చేశాడు.

  • 18 Dec 2022 08:39 PM (IST)

    బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్స్ గా హాజరైన రవితేజ, శ్రీలీల

    బిగ్ బాస్ సీజన్ ఫినాలే కు గెస్ట్స్ గా మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల హాజరయ్యారు. తనదైన మాటలతో రవితేజ అలరించారు.

  • 18 Dec 2022 08:28 PM (IST)

    స్టెప్పులేసి అదరగొట్టిన బాలీవుడ్ హాట్ బాంబ్

    బిగ్ బాస్ స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులేసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న ఊర్వశి. హుషారైన పాటలకు సూపర్ స్టెప్పులతో అలరించింది ఊర్వశి

  • 18 Dec 2022 08:22 PM (IST)

    బాలాదిత్యతో స్టెప్పులేసిన రాధ

    బాలాదిత్యకు బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున. బిగ్ బాస్ స్టేజ్ పై బాలాదిత్యతో కలిసి స్టెప్పులేసిన రాధ.

  • 18 Dec 2022 08:16 PM (IST)

    బిగ్ బాస్ స్పెషల్ గెస్ట్ గా సీనియర్ హీరోయిన్ రాధా

    బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ పై సందడి చేసిన ఒకప్పటి అందాల తార రాధా..

  • 18 Dec 2022 08:05 PM (IST)

    బిగ్ బాస్ నుంచి రోహిత్ అవుట్

    బిగ్ బాస్ హౌస్ ఉన్న టాప్ 5లో ఒకరిని నిఖిల్ బయటకు తీసుకు వచ్చాడు. సీజన్ 6 నుంచి రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు.

  • 18 Dec 2022 08:01 PM (IST)

    బిగ్ బాస్ హౌస్ లో యంగ్ హీరో నిఖిల్

    బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన నిఖిల్. నిఖిల్ ను హౌస్ లోకి పంపించిన నాగార్జున ఒకరిని బయటకు తీసుకురావాలని చెప్పారు.

  • 18 Dec 2022 07:42 PM (IST)

    బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన వీజే సన్నీ

    బిగ్ బాస్ మాజీ విన్నర్ వీజే సన్నీ బిగ్ బాస్ ఫినాల్ స్టేజ్ పై సందడి చేశాడు. విన్నర్ గా తన అనుభవాన్ని పంచుకున్నాడు.

  • 18 Dec 2022 07:35 PM (IST)

    బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ లవర్ బాయ్ అతనే

    బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కు రకరకాల ట్రోఫీలు అందించారు నాగ్. దీనిలో బెస్ట్ కుక్ గా మెరీనా పేరు చెప్పాడు రేవంత్. అలాగే ఆదిరెడ్డి బెస్ట్ డాన్సర్ గా ఫైమా పేరు చెప్పాడు. రోహిత్ బెస్ట్ గేమర్ గా రాజ్ పేరు చెప్పాడు. అలాగే కీర్తి బెస్ట్ స్లీపర్ గా శ్రీ సత్య పేరు చెప్పింది. ఇక శ్రీహాన్ బెస్ట్ లవర్ బాయ్ ఎవరు అంటే అర్జున్ కళ్యాణ్ పేరు చెప్పాడు. వీరికి నాగార్జున ట్రోఫీలు అందించాడు.

  • 18 Dec 2022 07:18 PM (IST)

    పాటలతో అలరించిన సింగర్ నకాష్ అజీజ్

    నకాష్ అజీజ్.. ఇండియాలో టాప్ సింగర్స్ లో ఒకరు.. తన పాటలతో బిగ్ బాస్ స్టేజ్ పైన అదరగొట్టాడు. హుషారైన పాటలతో ఆకట్టుకున్నాడు నకాష్ అజీజ్

  • 18 Dec 2022 07:11 PM (IST)

    బిగ్ బాస్ హౌస్‌లో నచ్చిన ప్లేసులు..

    టాప్ 5లో ఉన్న ఐదుగురికి కిరీటాలు ఇచ్చి హౌస్ లో వారికి బాగా నచ్చిన ప్లేస్ లో ఉంచామని చెప్పారు. దాంతో అందరు తమకు నచ్చిన ప్లేస్ లో ఉంచారు హౌస్ మేట్స్.

  • 18 Dec 2022 07:03 PM (IST)

    105 రోజుల బిగ్ బాస్ హౌస్ జర్నీ చూసి ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్

    105 రోజుల బిగ్ బాస్ హౌస్ జర్నీని చూపించారు. హౌస్ మేట్స్ చేసిన అల్లర్లు, ఆటలు, గొడవలు, ఆడిన టాస్క్ లు, గొడవలు.. అన్ని చూపించారు నాగార్జున. ఈ వీడియో చూస్తూ అందరు ఎంతో ఎమోషనల్ అయ్యారు.

  • 18 Dec 2022 06:35 PM (IST)

    ఆదిరెడ్డిని బిగ్ బాస్ కు వెళ్లొద్దు అని చెప్పను: కవిత

    ముందు బిగ్ బాస్ కు వెళ్లొద్దు అని చెప్పను అని అన్నారు ఆదిరెడ్డి భార్య కవిత.. ఇద్దరం కలిసి ఉన్నాం ఆయనను వదిలి ఉండలేక నేను ఆయనను  బిగ్ బాస్ కు వెళ్లోద్దని చెప్పను అని అన్నారు ఆదిరెడ్డి సతీమణి కవిత.

  • 18 Dec 2022 06:33 PM (IST)

    ఆ ఇద్దరిలో ఒకరు విన్నర్ అవుతారు : శ్రీ సత్య

    స్టేజ్ పైకి శ్రీ సత్య.. ఈ సీజన్ లో రేవంత్ , కానీ శ్రీహాన్ కానీ విన్నర్ అవుతారని చెప్పిన శ్రీసత్య. అలాగే బయట ఎలా ఉన్నానో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలానే ఉన్నా అని చెప్పుకొచ్చింది శ్రీ సత్య.

  • 18 Dec 2022 06:32 PM (IST)

    పెళ్లికూతురి గెటప్ లో వచ్చిన నేహా చౌదరి

    పెళ్లికూతురి గెటప్ లో వచ్చిన నేహా చౌదరి .. మరికాసేపట్లలో నేహా చౌదరి పెళ్లి జరగబోతోంది. బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి

  • 18 Dec 2022 06:20 PM (IST)

    మాజీ కంటెస్టెంట్స్ ఆడేసుకున్న నాగ్

    మాజీ కంటెస్టెంట్స్ తో మాట్లాడి ఉత్సహ పరిచారు నాగార్జున. బిగ్ బాస్ తర్వాత ఎవరి లైఫ్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు నాగార్జున.. మరోసారి తన మాటలతో ఒక ఆట ఆడేసుకున్నారు నాగ్.

  • 18 Dec 2022 06:17 PM (IST)

    ఆరోహి యాసకు ఫ్యాన్ అయిపోయా: నాగార్జున

    ఆరోహి మాటలను మిస్ అయ్యాను అను అన్నారు నాగ్. ఆరోహి యాసకు ఫ్యాన్ అయిపోయా అని అన్నారు నాగార్జున.

  • 18 Dec 2022 06:16 PM (IST)

    మట్టిలో ఉన్నా కిరీటం పైన ఉన్నా వజ్రం వజ్రమే: నాగ్

    బిగ్ బాస్6 మాజీ కంటెస్టెంట్స్ తో మాట్లాడారు నాగార్జున. బాలాదిత్య మాట్లాడుతూ అందరి మనసులు గెలుచుకున్నా అని అన్నారు. ఇక గీతూ మాట్లాడుతూ.. ఎదో అలా అలా ఉన్న అంటూ చెప్పుకొచ్చింది. దానికి నాగ్ మట్టిలో ఉన్నా కిరీటం పైన ఉన్నా వజ్రం వజ్రమే అని అన్నారు.

  • 18 Dec 2022 06:10 PM (IST)

    స్పెట్టేప్పులేసి అదరగొట్టిన బిగ్ బాస్ 6 మాజీ కంటెస్టెంట్స్

    స్పెట్టేప్పులేసి అదరగొట్టిన బిగ్ బాస్ 6 మాజీ కంటెస్టెంట్స్.. అర్జున్ కళ్యాణ్, వాసంతి, సూర్య, ఫైమా, రాజ్, సుదీప, మరీనా, అభినయ, గీతూ రాయల్, ఆరోహి

  • 18 Dec 2022 06:08 PM (IST)

    కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ

    బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే గ్రాండ్ గా మొదలైంది.. కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.

Published On - Dec 18,2022 6:06 PM