AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఆ యంగ్ హీరో.. పదేళ్ల తర్వాత కుదిరిన కాంబో

మెగాస్టార్‌తో కలిసి ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పుడు తన తదుపరి మిషన్ కోసం సిద్ధమవుతున్నారు. తన ఫేవరెట్ హీరోతో కలిసి ఐదోసారి బాక్సాఫీస్‌పై దండయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అనిల్.

Anil Ravipudi: అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఆ యంగ్ హీరో.. పదేళ్ల తర్వాత కుదిరిన కాంబో
Anil Ravipudi
Rajeev Rayala
|

Updated on: May 28, 2026 | 6:58 AM

Share

సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్.. వరుసగా హిట్స్ అందుకున్నాడు. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, వెంకటేష్ తో ఎఫ్ 1, ఎఫ్ 2, సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్యతో భగవంత్ కేసరి, మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి వెంకటేష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకీతో పాటు కళ్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటు మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అనిల్ మరో హీరోతో సినిమా చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఓ యంగ్ హీరోతో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ హీరో ఎవరో కాదు.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. రామ్ పోతినేని చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ అందుకోలేకపోతున్నాడు రామ్. ఇస్మార్ట్ తర్వాత వరుసగా రెడ్, డబుల్ ఇస్మార్ట్, వారియర్, రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చుపించాలేకపోయాయి.

ఇదిలా ఉంటే ఇప్పడు దర్శకుడిగా మారి సినిమా చేస్తున్నాడు రామ్ పోతినేని. ఈ సినిమాను ఇటీవలే అనౌన్స్ చేశాడు రామ్ పోతినేని.. ఇదిలా ఉంటే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే రామ్ పోతినేనితో ‘రాజా ది గ్రేట్’ సినిమా చేయాలనుకున్నాడు అనిల్. కానీ ఎందుకో కుదరకపోవడంతో ఆ సినిమాను రవితేజతో చేసి హిట్ అందుకున్నాడు అనిల్.. ఇక ఇప్పుడు పదేళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 2027 దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే వీటి పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us