హీరో సుహాస్ భార్య ఎవరో తెలుసా? వీరి ఏడేళ్ల ప్రేమకథ ఏడడుగుల బంధంగా ఎలా మారిందో తెలుసా? సినిమాకు మించిన ట్విస్టులు
సుహాస్ సినిమా లైఫ్ గురించి చాలా మందికి తెలుసు . అయితే అతని పర్సనల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. విజయవాడలో పుట్టి పెరిగిన సుహాస్ అక్కడే డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆతర్వాత సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చేశాడు.
షార్ట్ ఫిల్మ్ ద్వారా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ప్రారంభంలో కమెడియన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌లో నటించి మెప్పించిన అతను కలర్ ఫొటో సినిమాలో హీరోగానూ అదరగొట్టేశాడు. ఇక గమనం, ఫ్యామిలీ డ్రామా, తాజాగా అడివిశేష్ హిట్ 2 సినిమాల్లో సైకో కిల్లర్ పాత్రలు పోషించి అందరినీ భయపెట్టాడు. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్‌గా వరుస సినిమాలతో దూసుకెళుతోన్న సుహాస్ త్వరలోనే రైటర్ పద్మభూషణ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే సుహాస్ సినిమా లైఫ్ గురించి చాలా మందికి తెలుసు . అయితే అతని పర్సనల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. విజయవాడలో పుట్టి పెరిగిన సుహాస్ అక్కడే డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆతర్వాత సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చేశాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో మొదలుపెట్టి హీరో వరకు ఎదిగాడు. కాగా కలర్ ఫొటో సినిమాలో ప్రేమికుడిగా నటించి యూత్‌ను మెప్పించిన సుహాస్ నిజ జీవితంలోనూ ఓ లవ్‌స్టోరీ ఉంది. రీల్ లైఫ్‌లో తన ప్రేయసిని దక్కించుకోకపోయిన అతను రియల్ లైఫ్‌లో మాత్రం పెద్దలను ఎదిరించి మరీ మనసిచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండిView this post on Instagram
సుహాస్ లలిత అనే అమ్మాయిని ప్రేమించాడు. సుమారు ఏడేళ్ల పాటు వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి మాత్రం కుటుంబ సభ్యులు నో చెప్పారు. దీంతో సుహాస్ స్నేహితుల సహాయంతో ఒక దేవాలయంలో లలితను వివాహం చేసుకున్నాడు. అలా వీరి ఏడేళ్ల ప్రేమకథ ఏడడుగుల బంధంగా మారింది. కాగా లలిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత బాగా కలిసొచ్చిందని ఒకనొక సందర్భంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సుహాస్. సోషల్ మీడియాలో తన సతీమణికి సంబంధించిన ఫొటోలను కూడా తరచూ షేర్ చేస్తుంటాడు సుహాస్. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి చెబుతూ.. తాను నటించిన ఫ్యామిలీ డ్రామా సినిమా చూసి తన భార్య భయపడిందని చెప్పాడు. అంతేకాకుండా మూడు రోజులు ఆఫీసులోనే పడుకోవాలని ఇంటికి రావద్దని చెప్పిందని తెలిపాడు. ఈ సినిమాలో సుహాస్ భయంకరమైన సైకో కిల్లర్ పాత్రలో నటించాడు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..