Tollywood: ఒకప్పుడు సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ.. 700 మందికి పైగా ఉద్యోగులు..కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ హీరో
సినిమా ఇండస్ట్రీలోకి రావడమనేది చాలా మంది కల. దీనిని నెరవేర్చుకోవడం కోసం దేన్నైనా వదిలేస్తారు. లక్షల జీతమిచ్చే జాబులను వదిలేసి సినిమాల్లోకి వచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు ఇండస్ట్రీలో. ఈ టాలీవుడ్ హీరో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

ఈ టాలీవుడ్ హీరోకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. అందులోనే స్థిరపడాలనుకున్నాడు. కానీ అతనొకటి తలిస్తే దేవుడు మరోలా తలచాడు. ఉన్నత చదువులు చదువుకుని అమెరికా వెళ్లిపోయాడు. అక్కడే స్థిరపడిపోయాడు. సొంతంగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని కూడా ప్రారంభించాడు. ఈ కంపెనీలోసుమారు 700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను ఈ సంస్థ రన్ చేస్తోంది. ఇండియాలో కూడా తన సాఫ్ట్ వేర్ కంపెనీని తీసుకురావాలనుకున్నాడు. కానీ కుదర్లేదు. అయితే సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తో ఇప్పుడు అన్నింటనీ వదిలేసుకుని మరీ ఇండియా వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. హీరోగా నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవనుకుంటున్నారా? త్వరలోనే సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో ఆడియెన్స్ ను పలకరించనున్న విక్రాంత్.
గతంలో స్పార్క్ ది లైఫ్ అనే ఓ డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు విక్రాంత్. ఈ సినిమాకు అతనే దర్శకత్వం కూడా వహించడం విశేషం. 2023లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం విక్రాంత్ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. కలర్ ఫొటో హీరోయిన్ చాందినీ చౌదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. .మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో పాల్గొంటోన్న విక్రాంత్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఈయన ఏకంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తూ 700 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సంతాన ప్రాప్తిరస్తు సినిమా ప్రమోషన్లలో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ చౌదరి.. వీడియో..
View this post on Instagram
హీరో విక్రాంత్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








