AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అకౌంట్ హ్యాక్, ఫోటోలు మార్ఫింగ్.. ఎవరు చేశారో తెలిసి షాక్ అయిన అనుపమ

ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ.. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

అకౌంట్ హ్యాక్, ఫోటోలు మార్ఫింగ్.. ఎవరు చేశారో తెలిసి షాక్ అయిన అనుపమ
Anupama
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2025 | 12:47 PM

Share

అనాలా భామ అనుపమ పరమేశ్వరన్ కు ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలో అనుపమ ఫోటోలను మార్ఫింగ్ చేశారు కొందరు దుండగులు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు ఎప్పుడో ఒక సినిమా చేస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ సినిమాలో గ్లామర్ రోల్ లో కనిపించి షాక్ ఇచ్చింది ఆమె. ఈ చిత్రంలో అనుపమ అందాలకు కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత మాత్రం అమ్మడు ఫిల్మ్ జర్నీ స్లో అయ్యింది. మొన్నామధ్య పరదా సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత కిష్కిందాపురి అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలతో పాటు అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనుపమ.. తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది.

బాలయ్యకు లవర్‌గా, తల్లిగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

తన సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాక్ చేశారని.. ఫోటోలను మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి పోస్ట్ లు షేర్ చేస్తున్నారంటూ అనుపమ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అలాగే ఆమె పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు విచారణ చెప్పట్టారు. ఈ విశారనలో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అది తెలిసి పోలీసులే కాదు.. అనుపమ కూడా షాక్ అయ్యింది. తన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నది ఎవరో తెలుసుకొని అవాక్ అయ్యింది అనుపమ.

7/జీ బృందావన్‌ కాలనీ సీక్వెల్‌లో హీరోయిన్ ఈమేనా..! అందం అదిరిపోయిందిగా..

తమిళనాడుకు చెందిన ఓ 21ఏళ్ల యువతి ఇదంతా చేస్తుందని తెలిసి షాక్ అయ్యింది అనుపమ. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. అనుపమ ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్ట్ లు, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ తన ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. అలాగే తన ఫోటోలను మార్ఫింగ్ చేసిన యువతి పై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్టు తెలిపింది అనుపమ.

పెళ్ళికి ముందే తల్లైంది.. కట్ చేస్తే విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నవాడితో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.