AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7/జీ బృందావన్‌ కాలనీ సీక్వెల్‌లో హీరోయిన్ ఈమేనా..! అందం అదిరిపోయిందిగా.

7/G బృందావన్ కాలనీ.. సుమారు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ అప్పట్లో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ఇందులో నిర్మాత ఏఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా నటించాడు.

7/జీ బృందావన్‌ కాలనీ సీక్వెల్‌లో హీరోయిన్ ఈమేనా..! అందం అదిరిపోయిందిగా.
7g Brundavan Colony
Rajeev Rayala
|

Updated on: Nov 08, 2025 | 8:39 PM

Share

ఇప్పటివరకు వచ్చిన సినిమాలంటిలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఏదైనా ఉంది అంటే టక్కున చెప్పే 7/జీ బృందావన్‌ కాలనీ. ఈ సినిమాకు నటుడు, దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మించారు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ నటించారు. ఇక ఈ సినిమా కథ మన పక్కన ఇంట్లోనో.. లేక మన వీరిలోనో జరిగే స్టోరీలా ఉంటుంది. ఈ సినిమా మొదట్లో ప్రేక్షకులకు అనంతగా ఎక్కలేదు.. ఆ తర్వాత మెల్లగా ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. 2004లో విడుదలైంది ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ లు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ కొన్ని సినిమాలు చేసి ఆతర్వాత ఇండస్ట్రీకి మెల్లగా దూరం అయ్యారు. ఇక ఇప్పుడు 7/జి బృందావన్‌ కాలనీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.అప్పుడెప్పుడో ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు దర్శకుడు సెల్వ రాఘవన్. అలాగే అదే సమయంలో ఈ మూవీపోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరు నటిస్తున్నారని ప్రేక్షకులందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా 7/జి బృందావన్‌ కాలనీ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ అభిమానుల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

మొదటి భాగం విడుదలై పదేళ్ల దాటిన తర్వాత ఇప్పుడు రెండో భాగం ప్రకటించడం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. మొన్నామధ్య విడుదలలైన 7/జి బృందావన్‌ కాలనీ 2 పోస్టర్‌పై దర్శకుడు, సంగీత దర్శకుడు, కెమెరామెన్ పేర్లను మాత్రమే రాశారు. ఈ పోస్టర్‌లో సినిమాలో నటీనటుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. అయితే ఈ సినిమాలో మొదటి భాగంలో నటించిన రవికృష్ణ మరోసారి హీరోగా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ నటి చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మలయాళంలో ప్రముఖ నటి అనశ్వర రాజన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తారని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు మలయాళంలో పలు సినిమాల్లో నటించింది. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..
మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..
56 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
56 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
కేంద్రం కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ..
కేంద్రం కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ..
రోజూ తాగొచ్చి నరకం చూపిస్తున్న భర్త.. భార్య చేసిన పనికి ..
రోజూ తాగొచ్చి నరకం చూపిస్తున్న భర్త.. భార్య చేసిన పనికి ..
సంజూ శాంసన్ కెప్టెన్సీపై సెలెక్టర్ల మధ్య రచ్చ
సంజూ శాంసన్ కెప్టెన్సీపై సెలెక్టర్ల మధ్య రచ్చ
ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..
ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..
‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..
‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..
బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..
బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..
జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే..
జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..