AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Project K: ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ ?.. ప్రాజెక్ట్ కె నుంచి సరికొత్త అప్డేట్.. ఇదే నిజమైతే..

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. కథానాయికలుగా దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని చిత్రయూనిట్ అనౌన్స్ చేయడంతో సినిమాపై ఓ రేంజ్‏లో అంచనాలు పెరిగిపోయాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Project K: ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ ?.. ప్రాజెక్ట్ కె నుంచి సరికొత్త అప్డేట్.. ఇదే నిజమైతే..
Project K
Rajitha Chanti
|

Updated on: Jul 15, 2023 | 4:55 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ తారాగణంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. కథానాయికలుగా దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని చిత్రయూనిట్ అనౌన్స్ చేయడంతో సినిమాపై ఓ రేంజ్‏లో అంచనాలు పెరిగిపోయాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి నిత్యం ఫిల్మ్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగిస్తోంది.

ఇప్పటికే మేకర్స్ రివీల్ చేసిన పోస్టర్ లో రెండు వేరు వేరు చేతులు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ఆ రెండో చేయి కూడా ప్రభాస్ దే అంటున్నారు. ఈచిత్రంలో భూత, భవిష్యత్ కాలాల నుంచి కాన్సెప్ట్ ఉంటుందని అంటున్నారు. అంటే రెండు కాలమానాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రభాస్ పాత్రలే కావచ్చని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ఈనెల 21 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..