AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iBomma Ravi : నెలకు రూ.15 లక్షల సంపాదన.. ఒక్కో హార్డ్‌ డిస్క్‌లో 4 వేల సినిమాలు.. ఐబొమ్మ రవికి బిగుస్తున్న ఉచ్చు..

సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఇప్పటికే అతడి మీద ఐటీ, చట్టం, సినిమా పైరసీ, మోసం ద్వారా నష్టం, అనుమతి లేకుండా సినిమాలను దొంగిలించి రిలీజ్ చేయడం.. గోప్యతకు భంగం కలిగించడం ఇలా తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పుడు మరో యాక్ట్ జోడించారు.

iBomma Ravi : నెలకు రూ.15 లక్షల సంపాదన.. ఒక్కో హార్డ్‌ డిస్క్‌లో 4 వేల సినిమాలు.. ఐబొమ్మ రవికి బిగుస్తున్న ఉచ్చు..
Ibomma Ravi (1)
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2025 | 7:35 AM

Share

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిందితుడి మీద ఇప్పటివరకు ఐటీ, చట్టం, సినిమా పైరసీ, మోసం ద్వారా నష్టం, అనుమతి లేకుండా ప్రైవేటు చిత్రాలను దొంగిలించి ప్రసారం, గోప్యతకు భంగం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా వీటికి అదనంగా ఫారినర్స్‌ యాక్ట్‌ జోడించారు. విదేశీయులు మన దేశంలో నేరాలకు పాల్పడితే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. రవి ప్రస్తుతం కరేబియన్‌ దీవుల్లోని సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌ దేశ పౌరుడు. రికార్డుల ప్రకారం భారత పౌరుడు కాకపోవడంతో పోలీసులు ఫారినర్స్‌ యాక్ట్‌లోని సెక్షన్లను జోడించారు. రవిని ఐదు రోజుల పోలీసుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించడంతో.. చంచల్‌గూడ జైలు నుంచి హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌కు తీసుకొచ్చారు. తొలిరోజు బ్యాంకు లావాదేవీల గురించి సమాధానాలు రాబట్టారు. ఎన్‌ఆర్‌ఐ ఖాతాలు, క్రిప్టో వ్యాలెట్లకు నగదు మళ్లింపు గురించి ప్రశ్నించారు. మరో నాలుగు రోజులపాటు విచారించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఐబొమ్మ రవి.. DRM అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి సినిమాలు డౌన్‌లోడ్‌ చేసేవాడు. DRM ద్వారా ఓటీటీ కంటెంట్ ను నేరుగా తన ఐబొమ్మ వెబ్‌సైట్ లో అప్‌లోడ్‌ చేసి.. డబ్బులు భారీగా దండుకున్నాడు. 6 టెరాబైట్ల హార్డ్ డిస్క్‌లు 17 ఉన్నాయి. ఒక్కో 6TB హార్డ్ డిస్క్ లో 4 వేల సినిమాలు స్టోర్ చేశాడు. అంటే 16 హార్డ్‌ డిస్కుల్లో ఎన్ని సినిమాలుంటాయో లెక్కసుకోవచ్చు. రవికి హైదరాబాద్ కు చెందిన ఒక ముస్లిం యువతితో 2016 లో వివాహం జరిగింది. ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన యువతి రవి దగ్గర ఉండలేకపోయింది. దీంతో విభేదాలు వచ్చి అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఆ కసితో.. ఎక్కువ డబ్బు సంపాదించాలని హ్యాకింగ్‌ స్కిల్స్‌ను నేర్చుకున్నాడు రవి. అప్పటికే హైదరాబాద్ లో ER infotech పేరుతో వెబ్ సైట్ లు డిజైన్ చేస్తున్న రవి… సినిమాలపై మక్కువతో హ్యాకింగ్‌ చేసి.. ఐబొమ్మ వెబ్‌సైట్‌ ద్వారా పైరసీ చేయడం ప్రారంభించి కోట్లు కొల్లగొట్టాడు.

ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..

రవిని ఐదు రోజుల పోలీసుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. దీంతో అతడిని చంచల్ గూడ జైలు నుంచి గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బషీర్ బాగ్ లోని సీసీఎస్ కు తీసుకొచ్చారు. తొలిరోజు బ్యాంకు లావాదేవీల గురించి సమాధానాలు రాబట్టారు. ఎన్ఆర్ఐ ఖాతాలు, క్రిప్టో వ్యాలెట్లకు నగదు మళ్లింపు గురించి ప్రశ్నించారు. మరో నాలుగు రోజులపాటు విచారించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..

Follow Us