పుట్టిన వెంటనే దత్తత.. 12ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి.. స్టార్ హీరోలకు మించి బిజీ హీరోయిన్
తెలుగు చిత్రసీమలో తన విశేష ప్రతిభతో, అద్భుత నృత్యాలతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన నటి జ్యోతిలక్ష్మి జీవితం ఒక స్ఫూర్తిదాయక గాథ. తమిళనాడులో జన్మించినప్పటికీ, తెలుగు సినీ రంగంతో ఆమె అనుబంధం చివరి వరకు కొనసాగింది. ఐదేళ్ల వయసులోనే బాలనటిగా సినీ ప్రవేశం చేసిన ఆమె, తన అపారమైన కృషి, భరతనాట్య నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదిగి, అగ్రశ్రేణి నర్తకిగా, నటిగా గుర్తింపు పొందారు.

జ్యోతిలక్ష్మి తెలుగు ఆమెపేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేశారు జ్యోతిలక్ష్మీ. కానీ ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి.. పుట్టగానే దత్తత తీసుకున్నారు . ఆమె మేనత్త ధనలక్ష్మి జ్యోతిలక్ష్మిను పెంచి పెద్ద చేశారు. ఈ కారణంగా ఆమెకు తన అసలు తల్లిదండ్రులకు, ఏడుగురు సోదరీ సోదరులకు దూరం కావాల్సి వచ్చింది. పెంచుకున్న తల్లి ధనలక్ష్మి, జ్యోతిలక్ష్మిని తోడబుట్టిన వారికి దూరంగా ఉంచడం వల్ల, ఆమె సోదరి జయమాలినితో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తాయి. చిన్నప్పటి నుండే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన జ్యోతిలక్ష్మి సినీ రంగంలోకి అడుగుపెట్టడానికి ఆమె బంధువుల పరిచయాలు దోహదపడ్డాయి. అయితే, తన ప్రతిభతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆమె అనుకునాన్రు. బాలనటి దశ నుండి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోయిన్ గా, మెయిన్ హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలో జ్యోతిలక్ష్మికి రాజనర్తకిగా విశేషమైన గుర్తింపు లభించింది. పలు జానపద చిత్రాల్లో తమిళంలో ఎంజీఆర్, జెమినీ గణేశన్ లతో, తెలుగులో కాంతారావు, ఎన్టీఆర్ లతో పాటు మలయాళం, కన్నడ స్టార్ లతో కలిసి ఆడిపాడారు.
ఇది కూడా చదవండి :చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గర్వంగా ఉందన్న రోజా
1967లో పెద్దక్కయ్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యే నాటికి ఆమెకు 19 ఏళ్లు. అంతకుముందే 12వ ఏట నుంచే తమిళ, మలయాళ చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉండటం వల్ల షూటింగ్‌లో ఆమె అత్యంత వేగంగా తన షాట్స్ ను పూర్తి చేయగలగడం ఆమెకు ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. డాన్సర్ గా ఆమెకు విరివిగా అవకాశాలు లభించాయి. ఎన్టీఆర్, కాంతారావు, రామకృష్ణ వంటి సీనియర్ నటుల నుండి కృష్ణ, శోభన్ బాబు వంటి సమవయస్కులతో, చిరంజీవి, మోహన్ బాబు వంటి జూనియర్ నటులతో కూడా నటించారు. 70వ దశకంలో తెలుగులో ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌కి చేరింది. నిద్ర రాకుండా టాబ్లెట్లు తీసుకుని కూడా షూటింగ్‌లకు హాజరయ్యేవారంటే.. ఆమెకున్న అంకితభావం అప్పట్లో అలా ఉండేది మరి. ఆమె డాన్స్ చేసిన గుడి వెనక నా సామి, లే లే లే (ప్రేమ్ నగర్) వంటి పాటలు ఆమెకు ట్రేడ్‌మార్క్‌గా నిలిచాయి.
ఇది కూడా చదవండి: ఆ స్టార్ హీరో హలీం వండితే పండగే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే
జ్యోతిలక్ష్మి కెమెరామెన్ సాయి ప్రసాద్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా వివాహం చేసుకున్నప్పటికీ, తర్వాత వారిని ఒప్పించగలిగారు. ఈ దంపతులకు జ్యోతి మీన అనే కుమార్తె జన్మించింది, ఆమె కూడా తర్వాత నటిగా మారారు. సాయి ప్రసాద్ ఆమె వృత్తిని గౌరవిస్తూ, జీవితాంతం ఆమెకు తోడుగా నిలిచారు. జ్యోతిలక్ష్మి దైవభక్తి మెండుగా కలవారు, ముఖ్యంగా అయ్యప్ప స్వామి పూజలంటే ఆమెకు ప్రత్యేక ఇష్టం. సినిమాల్లో రతీదేవిలా కనిపించినా, బయట భక్తిమూర్తీభవించిన స్త్రీగా, స్వచ్ఛమైన గృహిణిగా ఉండేవారు.జీవితపు చివరి రోజుల్లో జ్యోతిలక్ష్మి ఆరోగ్య సమస్యలతో పోరాడారు. ఆరోగ్యం విషమించినా, షాట్ల మధ్య విశ్రాంతి తీసుకుంటూ నటిస్తూనే ఉండేవారు. 2016లో 65 ఏళ్ల వయసులో తన స్వగృహంలోనే కన్నుమూశారు.
ఇది కూడా చదవండి :అతను ఎంతో గొప్పనటుడు నటుడు.. ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది





