ఆ సినిమా ఘనవిజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత ఆమె ఆచితూచి కథలను ఎంచుకుంటూ వస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆసక్తికరమైన విషయం వెల్లడించింది.
టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ఒక భారీ హిట్ సినిమాను తాను రిజెక్ట్ చేశానని, ఆ నిర్ణయం పట్ల ఇప్పటికీ తీవ్రంగా బాధపడుతున్నానని తెలిపింది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో తేజ సజ్జా నటించిన 'హనుమాన్' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
సంక్రాంతి రేసులో వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదట ఫరియానే సంప్రదించారట.
నా కెరీర్‌లో నేను తీసుకున్న అత్యంత తప్పుడు నిర్ణయం ఏదైనా ఉందంటే అది 'హనుమాన్' సినిమాను వదులుకోవడమే అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఫరియా.
ఆ సమయంలో నాకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదు, ఆలోచించే శక్తి లేక నో చెప్పేశాను. పాత్రల ఎంపికలో ఎక్కువగా జాగ్రత్తలు పడాలనే ఉద్దేశంతో అలా చెప్పానని అన్నారు.
ఇప్పటికీ తాను ఎక్కడైనా హీరో తేజ సజ్జాను లేదా దర్శకుడు ప్రశాంత్ వర్మను కలిస్తే.. "అంత మంచి సినిమాను మిస్ చేసుకున్నాను" అని బాధపడతానని పేర్కొంది.