AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Artist: బ్లాక్ బస్టర్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేంట్రా బాబూ ఇంతందంగా మారిపోయింది..

సాధారణంగా సినిమా ప్రపంచంలో చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయమై.. ఆ తర్వాత నటీనటులుగా మారినవారు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు ఇప్పటికీ ఇండస్ట్రీలో సందడి చేస్తున్న హీరో హీరోయిన్లుగా చైల్డ్ ఆర్టిస్టులు అలరిస్తున్నారు. మరికొందరు సినిమాలకు దూరంగా మరో రంగాల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఓ చిన్ననాటి హీరోయిన్ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

Child Artist: బ్లాక్ బస్టర్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేంట్రా బాబూ ఇంతందంగా మారిపోయింది..
Actress (2)
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2025 | 7:19 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో తెగ వైరలవుతుంది. అందులో కనిపిస్తున్న అమ్మాయి.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన అమ్మాయి. సినీరంగంలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్స్ సెలక్ట్ చేసుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు ఆమె చేసిన సినిమాలోని సాంగ్ తెగ సంచలనం సృష్టించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? “తూనీగా.. తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..” అంటూ ఆడిపాడింది. ఇప్పుడు గుర్తొచ్చింది కదా.. తనే మనసంతా నువ్వే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ అమ్మాయి పేరు సుహాని కలిత. ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన మనసంతా నువ్వే సినిమాతో పాపులర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..

ఈ సినిమాతోపాటు గణేశ్, ప్రేమంటే ఇదేరా, హిందుస్థాన్ : ద మదర్, ఎలా చెప్పను, ఆనందమాయె వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో సవాల్, స్నేహగీతం వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. అలాగే తమిళంలోనూ రెండు సినిమాలు చేసింది. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన గుర్తింపు.. ఆ తర్వాత కథానాయికగా అంతగా పాపులర్ కాలేదు. హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. దీంతో ఆకస్మాత్తుగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.

ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..

2011లో తమిళంలో అప్పవి అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. 2022లో ఎంటర్ ప్రెన్యూర్, సంగీత కళాకారుడు విభర్ హసీజాను పెళ్లాడింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న సుహానీ.. ట్రావెల్ ఇన్ఫ్లెయేన్సర్ గా మారిపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది సుహానీ.

ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..

Suhani

Suhani

ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Follow Us