హీరోల్లో అతడే నా క్రష్.. ఇప్పటికీ మేము ఫ్రెండ్స్.. లైలా కామెంట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
17 May 2026
90వ దశకంలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, చబ్బీ లుక్స్‌తో సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్ లైలా. అప్పట్లో ఆమెకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.
తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలు అందుకుని అప్పట్లో కుర్రకారు కలల రాకుమారిగా నిలిచారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది.
ఇటీవల కార్తీ నటించిన 'సర్దార్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పుడు దాదాపు 22 ఏళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు.
సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన 'గోదారి గట్టుపైన' అనే చిత్రంలో లైలా ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
"మీ కో-స్టార్లలో ఎవరంటే క్రష్?" అని యాంకర్ అడగ్గా.. లైలా నవ్వుతూ "సూర్య" అని టక్కున జవాబిచ్చారు. వెంటనే స్పందిస్తూ.. "ఇది వింటే జ్యోతిక నన్ను చంపేస్తుంది" అన్నారు.
ఆ తర్వాత అసలు విషయం చెప్తూ, అది కేవలం క్రష్ మాత్రమే కాదని, సూర్యతో తనకు ఎంతో ప్రత్యేకమైన స్నేహ బంధం ఉందని అసలు విషయం చెప్పుకొచ్చారు.
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదురుతుందని, అందుకే సూర్యతో బాండింగ్ తనకు ఎప్పుడూ స్పెషలే అని స్పష్టం చేశారు. అప్పట్లో ఈ జోడీకి విపరీతమైన క్రేజ్ ఉండేది.
వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. తనకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టమని రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు.