AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లుడి కోసం మామగారు ఇచ్చిన అరుదైన కానుక.. ఖరీదు తెలిస్తే కంగుతినాల్సిందే! ఇలాంటి మామే కావాలంటున్న నెటిజన్లు..

మన దేశంలో వివాహ బంధాలన్నా, పెళ్లి తర్వాత అల్లుడికి ఇచ్చే మర్యాదలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పండుగలు, పబ్బాలు వస్తే అల్లుడికి బంగారు ఉంగరాలు, బైక్‌లు లేదా ఖరీదైన దుస్తులు కానుకగా ఇవ్వడం మనం తరచూ చూస్తుంటాం. కానీ, ఇక్కడో మామగారు మాత్రం తన అల్లుడి కోసం ఎవరూ ఊహించని, నభూతో నభవిష్యతి అనేలాంటి ఒక అరుదైన కానుకను సిద్ధం చేయించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొల్హాపూరి చెప్పులను అల్లుడికి బహుమతిగా ఇచ్చారు. చెప్పులా..? ఇందులో ఏముందని ఆశ్చర్యపోతున్నారా..? అవి మామూలు చెప్పులు కాదండోయ్‌.. అత్యంత ఖరీదైన వెండి పాదరక్షలు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

అల్లుడి కోసం మామగారు ఇచ్చిన అరుదైన కానుక.. ఖరీదు తెలిస్తే కంగుతినాల్సిందే! ఇలాంటి మామే కావాలంటున్న నెటిజన్లు..
Silver Kolhapuri Chappals
Jyothi Gadda
|

Updated on: May 18, 2026 | 4:16 PM

Share

భారతీయ వివాహ సంప్రదాయాలలో అల్లుడికి ఇచ్చే మర్యాదలు, బహుమతులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. పెళ్లి సమయాల్లో లేదా పండుగలకు అల్లుళ్లకు బట్టలు, బంగారు ఉంగరాలు, బైక్‌లు కానుకగా ఇవ్వడం సర్వసాధారణం. కానీ, మహారాష్ట్రలో ఒక మామగారు తన అల్లుడిపై ఉన్న ప్రేమతో ఎవరూ ఊహించని విధంగా ఒక వినూత్నమైన బహుమతిని ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన అల్లుడి రాకను మరింత ప్రత్యేకంగా మార్చడానికి ఏకంగా ఒకటిన్నర కిలోల వెండితో చేసిన కొల్హాపూరి చెప్పులను బహుమతిగా అందించారు.

ఈ ఆసక్తికరమైన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో వెలుగుచూసింది. సాంగ్లీ జిల్లాకు చెందిన ఒక సంపన్న కుటుంబానికి చెందిన మామగారు ఈ విలక్షణమైన నిర్ణయం తీసుకున్నారు. కొల్హాపూరి చెప్పులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అందుకే, అదే శైలిలో వెండి చెప్పులు చేయించాలని ఆయన కొల్హాపూర్‌కు చెందిన ఒక ప్రముఖ హస్తకళాకారుడిని సంప్రదించారు. ఈ ప్రత్యేకమైన వెండి చెప్పుల జతను అత్యంత నైపుణ్యంతో, ఆకర్షణీయంగా రూపొందించడానికి ఆ కళాకారుడికి దాదాపు ఎనిమిది రోజుల సమయం పట్టింది.

పూర్తిగా వెండితో రూపుదిద్దుకున్న ఈ కొల్హాపూరి చెప్పుల బరువు సుమారు 1.5 కిలోలు ఉంది. మార్కెట్ ధరల ప్రకారం ఈ చెప్పుల విలువ దాదాపు 4 లక్షల రూపాయలుగా ఉంటుందని అంచనా. కేవలం వీటి తయారీ కూలి (మజూరీ) కోసమే సదరు కళాకారుడికి 22 వేల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో.. ధరతో సంబంధం లేకుండా బంధాల కలయికను, తన హోదాను చాటుకోవడానికి ఈ మామగారు చేసిన ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ వెండి కొల్హాపూరి చెప్పుల ఫోటోలు, వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వినూత్నమైన ఆలోచనను చూసి ఆశ్చర్యపోతూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అల్లుడంటే ఇలాంటి మామగారే దొరకాలి అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!