AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా ఎలా ప్లాన్ చేశావన్న..! ఒకటి అమెరికా.. ఇంకోటి అమీర్ పేట్.. IBOMMA రవి మాస్టర్ ప్లాన్

ఐ బొమ్మ రవి కేసులో రోజుకు కొత్త విషయ తెరమీదకు వస్తుంది. ఇప్పటికే అతడిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా కస్టడీ పిటిషన్ను దాఖలు చేశారు. ఏడు రోజులపాటు అతని పోలీసులు కస్టడీకి కోరారు. దీనిపై నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. మరోవైపు ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు దాగి ఉన్నాయి.

ఇలా ఎలా ప్లాన్ చేశావన్న..! ఒకటి అమెరికా.. ఇంకోటి అమీర్ పేట్.. IBOMMA రవి మాస్టర్ ప్లాన్
Ibomma Ravi
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Nov 19, 2025 | 11:49 AM

Share

ఐ బొమ్మ రవిని పోలీసులు పట్టుకునేలా చేసింది రెండు డొమైన్లే. ఈ రెండు డొమైన్ల ద్వారానే పోలీసులకు ఇమ్మడి రవి వివరాలు తెలిసాయి. ఐ బొమ్మ మొత్తాన్ని నడుపుతుంది కూడా రవినే అనే అంశాన్ని ఈ రెండు డొమైన్ లు పట్టించాయి. సాధారణంగా రవి నడుపుతున్న వెబ్సైట్ అంతా సినిమా పైరసికి సంబంధించి ఉన్నది. అందులో బెట్టింగ్ యాడ్ లను పెట్టేందుకు మూడు డొమైన్ లను ఉపయోగించాడు.

ఐ బొమ్మ వెబ్సైట్కు, బెట్టింగ్ సైట్కు మధ్యలో ఉండే ట్రాఫిక్ డొమైన్ లు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఆ రెండు డొమైన్లు ఏంటంటే ఒకటి tradersin.com, makeindiashop.com అనే రెండు డొమైన్ ల ద్వారానే అటు వెబ్సైట్కు ఇటు బెట్టింగ్ సైటుకు లింకు చేశాడు ఇమ్మడి రవి. ఈ రెండు డొమైన్ల వివరాలు ఇవ్వాల్సిందిగా పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు కాంటాక్ట్ చేశారు. మొదట వివరాలు ఇచ్చేందుకు వాళ్ళు సంకోచించినప్పటికీ ఆ తర్వాత సబర్ క్రైమ్ పోలీసులకు వాటి వివరాలను అందించారు.

ఈ రెండు డిమాండ్లలో ఒకటి అమెరికాలో మరొకటి అమీర్పేట్ లో రిజిస్టర్ అయివున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు వివరాలు అందించారు.. రెండు కూడా ఇమ్మడి రవి పేరు మీదే ఉండటం విశేషం. ఈ రెండు డొమైన్లకు రవి ఒకటే కాంటాక్ట్ నంబర్ ఇచ్చి దొరికిపోయాడు. ఆ కాంటాక్ట్ నంబర్ వివరాలు ఇవ్వాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లకు సైబర్ క్రైమ్ పోలీసులు లేఖలు రాశారు. అవి కూడా ఇమ్మడి రవి c/o ఆఫ్ కూకట్పల్లి అని ఉండటంతో పోలీసులు ఆ నంబర్ను ట్రేస్ లో పెట్టారు. ఇమ్మడి రవి హైదరాబాద్ రాగానే అతని కదలికలను గమనించిన పోలీసులు కూకట్ పల్లికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా రవి పోలీసులకు దొరకటానికి రెండు డొమైన్లు పనికి వచ్చాయి. తాను తయారు చేసిన డొమైన్ ల ద్వారానే రవి పట్టుబడటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us