ఆ సినిమా చేయడమే నా తప్పు. వారం రోజులు మనిషిని కాలేదు.. మీనాక్షి..
Rajitha Chanti
Pic credit - Instagram
15 May 2026
టాలీవుడ్ ‘లక్కీ భాస్కర్’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ రోల్స్‌తో మెప్పిస్తున్న నటి మీనాక్షి చౌదరి.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ వంటి భారీ చిత్రాలలో నటిస్తూ కెరీర్ పరంగా పీక్ స్టేజ్‌లో దూసుకుపోతున్న ఆమె పలు విషయాలు వెల్లడించింది.
గతంలో తాను నటించిన ఒక సినిమా విషయంలో ఎదురైన విమర్శల వల్ల తీవ్ర మనస్థాపానికి గురైనట్లు వెల్లడించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సరసన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) సినిమాలో నటించే అవకాశం రావడం మీనాక్షి కెరీర్‌లో ఒక పెద్ద మలుపు.
ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర, విజయ్‌తో కెమిస్ట్రీ విషయంలో సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ఎదురైందని.. అవి చూసి ఎంతో బాధపడిందట.
ముఖ్యంగా ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యత లేదని, కేవలం గ్లామర్ కోసమే అన్నట్లుగా విమర్శలు వచ్చాయి. ఈ నెగటివిటీ చూసి తాను ఎంతో బాధపడ్డానని తెలిపింది.
దాదాపు వారం రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్ళానని మీనాక్షి గుర్తుచేసుకున్నారు. ఈ చేదు అనుభవం తనలో ఒక మార్పుకు కారణమైందని ఆమె తెలిపారు.
కేవలం పెద్ద సినిమాలు, స్టార్ హీరోలు అని మాత్రమే చూడకుండా, కథలో తన పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్