AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను సినిమా ఛాన్స్ ఇస్తానని కమిట్మెంట్ అడిగాడు: ఇన్‌ఫ్లుయెన్సర్ సుష్మ భూపతి

సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారిలో సుష్మ భూపతి ఒకరు. రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అతను సినిమా ఛాన్స్ ఇస్తానని కమిట్మెంట్ అడిగాడు: ఇన్‌ఫ్లుయెన్సర్ సుష్మ భూపతి
Sushma Bhupathi
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2025 | 10:35 AM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది పాపులర్ అవుతున్నారు. కొంతమంది ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది తమలో ఉన్న డాన్స్ టాలెంట్, యాక్టింగ్ టాలెంట్ తో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కానీ మరికొంతమంది మాత్రం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో సుష్మా భూపతి ఒకరు. ఒకే ఒక్క వీడియోతో వైరల్ అయ్యి ఇప్పుడు ఇన్ స్టాలో దాదాపు 9లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది ఆమె.. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా రకరకాల వీడియోలు చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంది. రీల్స్ తో పాటు పలు ప్రమోషన్స్ చేస్తూ హడావిడి చేస్తూ ఉంటుంది ఆమె.. అలాగే ఆమె రకరకాల ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పాపులర్ అవ్వక ముందు టీచర్ గా చేశాను.. ఎన్నో కష్టాలు పడ్డం.. నాకు పాపా పుట్టిన తర్వాత నేను జాబ్ మానేశా.. నా భర్త ఫైన్షియల్ ఇష్యుస్ వచ్చాయి. మేము రోడ్డు మీద పడ్డ సమయంలో మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దాదాపు రెండేళ్లు నరకం చూశాం. నాకు రెండు పానిక్ ఎటాక్స్ కూడా వచ్చాయి. మా నాన్న మమ్మల్ని బాగా చూసుకున్నారు. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు అని చెప్పుకొచ్చింది.

టైం పాస్ కు టిక్ టాక్ వీడియోస్ చేసేదాన్ని.. టిక్ టాక్ తర్వాత ఇన్ స్టాలో చాలా మందిని చూసి నేను కూడా చేయాలి అని అనుకున్నా.. వినాయక చవితిరోజు అనుకోకుండా ఓ వీడియో చేశా దాంతో పాపులర్ అయ్యా.. అని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె పాట్లాడుతూ.. పాపులర్ అయిన తర్వాత తనకు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి అని తెలిపింది సుష్మ. కాకపోతే సినిమా ఛాన్స్ ఇస్తా అని చెప్పి ఒక వ్యక్తి కమిట్మెంట్ అడిగాడు అని తెలిపింది. ఓ వ్యక్తి ఫోన్ చేసి నాతో మాట్లాడాడు  కొన్ని ఉంటాయమ్మా అన్నాడు అప్పుడు నాకు వెలగలేదు.. పైగా నేను ఫోన్ స్పీకర్ పెట్టి మాట్లాడతా.. అతను అలా అడగ్గానే సారీ సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు.. నేనేమి ఖాళీగా లేను.. డైలీ బిజీ బిజీగా ఉంటాను. నా ఫ్యామిలి కోసం ఒక రోజు ఇవ్వడానికే టైం లేదునాకేమి అవసరం.. నాకు వద్దు.. నా మనసు చంపుకొని నేను ఏ పని చేయను అని చెప్పా అని చెప్పుకొచ్చింది సుష్మ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు