సుమన్ శెట్టికి సాలిడ్ సలహా ఇచ్చిన భార్య.. వదిన మాట విను అన్న అంటున్నఆడియన్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం హౌస్ లో ఫ్యామిలీ వీక్ జరుగుతోంది. కాగా ఎప్పటిలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదకొండో వారం నామినేషన్స్ హోరా హోరీగా సాగాయి.

బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. హౌస్ మేట్స్ కు తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దాంతో నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఫ్యామిలీలు వచ్చాయి. ముందుకు సుమన్ శెట్టి భార్య ఎంట్రీ ఇచ్చారు. సుమన్ శెట్టి భార్య లాస్య హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో సుమన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భార్యను చూసిన ఆనందంలో ఎమోషనల్ అయ్యారు. భార్యను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే కొడుకు, కూతురి గురించి అడిగి తెలుసుకున్నారు సుమన్. భార్యతో మాట్లాడుతున్నంత సేపూ ఆయన ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. అది చూసి పేక్షకులకు కూడా కంటతడి పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే సుమన్, లాస్య ఇద్దరూ చాలా సేపు ఒంటరిగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే సుమన్ కు అదిరిపోయే సలహా ఇచ్చారు లాస్య. తనూజాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెప్పారు సుమన్ భార్య. ఎందుకు నెగిటివ్ అవుతున్నానా అని అమాయకంగా అడిగాడు సుమన్ శెట్టి. లాస్య మాట్లాడుతూ.. తనూజాతో తగ్గించండి.. నెగిటివ్ వస్తుందని కాదు ఆమె ఎక్కువ హైప్ అవుతుంది. హౌస్ లో ఎవరు హైప్ ఉంటున్నారో వాళ్లను మంచి చేసుకుంటుంది. అందుకే చెప్తున్నా.. కొంచం జాగ్రత్తగా ఉండండి అని భర్తకు సలహా ఇచ్చారు లాస్య.
దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ దత్త పుత్రిక తనూజ పై ఇప్పటికే చాలా ట్రోల్స్ వచ్చాయి. బిగ్ బాస్ ఆమెను కావాలనే సేవ్ చేస్తున్నారని, ఎక్కువ స్క్రీన్ ఆమెకే ఎక్కువ ఇస్తున్నాడు. ఇక ఇప్పుడు సుమన్ శెట్టికి భార్య ఇచ్చిన సలహా పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా వదిన మాట విను.. ఖచ్చితంగా కప్పు కొడతావ్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




