AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుణ్ తేజ్‌కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్.. హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్

మెగా హీరో వరుణ్ తేజ్ చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా వరుణ్ తేజ్ కు సక్సెస్ మాత్రం రావడం లేదు. దాంతో చిన్న గ్యాప్ ఇచ్చిన వరుణ్ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నాడు.

వరుణ్ తేజ్‌కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్.. హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్
Varun Tej
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2025 | 1:35 PM

Share

మెగా హీరో వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు.  2014లో “ముకుంద” సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు వరుణ్. ఈ యంగ్ హీరో విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం 9000 కెఎంపిహెచ్, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్, గాని , గాండీవధారి అర్జున, మట్కా సినిమాలు చేశాడు. వీటిలో కంచె,ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు వరుణ్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మట్కా సినిమా నిరాశపరచడంతో చిన్న గ్యాప్ తీసుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నడు.

వరుణ్ తేజ్ కెరీర్ లో 15వ సినిమా గా వస్తున్న ఈ సినిమాకు గాంధీ మేర్లపాక  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ కోసం ఓ అందాల భామను ఎంపిక చేశారని టాక్ ఆమె ఎవరో కాదు. రితిక నాయక్. ఈ బ్యూటీ గతంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనం లో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

అయితే రితిక నాయక్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు, అందం అభినయం ఉన్నా కూడా ఎందుకో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. రితిక నాయక్ తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో  ఇక రితిక నాయక్ నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.  ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తుంది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అందాల భామ. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసే క్యూట్ ఫోటోలు అభిమానులను తెగ ఆట్టుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..