- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine is who has done 8 films in Telugu, She is Pranitha Subhash
ఒకేఒక్క సినిమా హిట్ 7 ఫ్లాప్స్.. దెబ్బకు కనపడకుండా పోయిన అందాల భామ
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు.
Updated on: Nov 15, 2025 | 1:51 PM

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు.

దాంతో అభిమానులు ఈ ముద్దుగుమ్మల కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఇప్పుడు ఓ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలిస్తున్నారు. ఇంతకూ ఆ భామ ఎవరో తెలుసా.? తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు కానీ హిట్ అయ్యింది మాత్రం ఒకే ఒక్క సినిమా.

అందంలో ఈ అమ్మడు అప్సరస.. కెరీర్ పీక్ లో ఉండగానే సినిమాలకు దూరం అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అందం, అభినయం ఉన్నా కూడా సక్సెస్ సాధించలేకపోయింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా చేసింది, సెకండ్ హీరోయిన్ గాను చేసింది అయినా కూడా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు.

ఇంతకూ ఆమె ఎవరో కాదు టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్. తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సుభాష్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.

హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేదు. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అయినా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో భారీ హిట్ అందుకుంది. కానీ అంతగా అవకాశాలు రాలేదు. కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది.




