AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అబ్బా.. ఏం వాయించారు సార్.. సంగీత కళతో అబ్బురపరిచిన కలెక్టర్.. ఇదిగో వీడియో

జిల్లా కలెక్టర్ అంటే నిత్యం సమీక్షలు, సమావేశాలు, అధికారులతో చర్చలు, క్షేత్రస్థాయి పర్యటనలతో బిజీ బిజీగా ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కారం పాలనాపరంగా నిత్యం బిజీ బిజీగ వుంటారు. కానీ తెలంగాణలోని ఓ కలెక్టర్ మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపించారు. ఏకంగా హార్మోనియం చేతబట్టి సంగీత పాఠాలు చెబుతూ, తబలాపై లయలు పలికిస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: అబ్బా.. ఏం వాయించారు సార్.. సంగీత కళతో అబ్బురపరిచిన కలెక్టర్.. ఇదిగో వీడియో
Adilabad Collector
Naresh Gollana
| Edited By: |

Updated on: May 15, 2026 | 7:37 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక వేసవి శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్‌గూడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు.

15 రోజుల పాటు నిర్వహించే ఈ వేసవి శిబిరంలో విద్యార్థుల ఆసక్తిని బట్టి సంగీతం, యోగా, క్రీడలు, కోడింగ్ వంటి విభాగాల్లో శిక్షణ అందించేందుకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సంగీత విభాగంలో హార్మోనియం, తబలా వంటి వాయిద్యాలను నేర్పించేందుకు ప్రత్యేక ట్రైనింగ్ ఏర్పాటు చేయడం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా చేసిన పని అక్కడున్న వారందరిని ఆశ్చర్యపరిచింది.

తరగతి గదిలోకి వెళ్లిన ఆయన నేరుగా హార్మోనియం వద్ద నిల్చొని స్వయంగా హార్మోనియాన్ని వాయిస్తూ విద్యార్థులకు సంగీత పాఠాలు చెప్పారు. హార్మోనియం మెట్లపై తన వేళ్లతో స్వరాలను పలికిస్తూ అబ్బురపరిచారు. తబలా పై అద్భుతంగా వాయిస్తూ తనలోని సంగీత కళాకారుడిని అక్కడివారికి పరిచయం చేసారు. కలెక్టర్ అద్భుత కళను చూసి అక్కడున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు వావ్ కలక్టర్ జి అని కొనియాడారు. విద్యతో పాటు కళల పట్ల మక్కువ పెంచుకోవాలని ఈ సందర్బంగా విద్యార్థులకు సూచించారు కలెక్టర్ రాజర్షి షా.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us