Raghu Ram: బాబోయ్.. ఈ స్టార్ సింగర్ ఈ విలన్ భార్యనా.. ? అందంలో హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
తెలుగు చిత్రపరిశ్రమలో అతడు మోస్ట్ వాంటెడ్ విలన్. ఎన్నో హిట్ చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి పేరు రఘురామ్. ఈ పేరు చెబితే అసలు గుర్తు పట్టలేరు. కానీ నున్నటి గుండుతో కనిపిస్తూ పవర్ ఫుల్ నటనతో కనిపించే ఈ నటుడిని చూస్తే ఇట్టే గుర్తుపడతారు. పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ పాపులర్ విలన్స్ లో రఘు రామ్ ఒకరు. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో కనిపించాడు. అతడికి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. కానీ అచ్చ తెలుగబ్బాయి. ఆంధ్రాలోని మచిలీపట్నంకు చెందిన రఘురామ్ అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఎంటీవీ ‘రోడిస్’ షోతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఈ షో ద్వారా బాలీవుడ్ అడియన్స్ కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత మరికొనని టీవీ షోల్లో పాల్గొన్నాడు. శివకార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమాతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చాడు.
డాక్టర్ సినిమాలో విలన్ గ్యాంగ్ మెంబర్ గా కనిపించాడు. ఈ మూవీతో సౌత్ అడియన్స్ కు దగ్గరయ్యాడు. తమిళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. ‘కీడాకోలా’, ‘మెకానిక్ రాకీ’ వంటి చిత్రాలతో తెలుగులోనూ పాపులర్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటున్నాడు రఘురామ్. ఇక అతడి పర్సనల్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. రఘురామ్ కెనడాకు చెందిన సింగర్ నటాలియాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితమే వీరిద్దరి వివాహం ఇటు తెలుగు… అటు క్రిస్టియన్ సంప్రదాయాల్లో కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు.
ప్రస్తుతం రఘురామ్ ఫ్యామిలీ ఫోటోస్, పెళ్లి వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవలే వీరిద్దరి ఐదో వివాహ వార్షికోత్సం ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా రఘురామ్ ఫ్యామిలీ ఫోటోస్ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విలన్ భార్య స్టార్ సింగరా.. ? ఇంత అందమైన భార్య ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
View this post on Instagram
ఇవి కూడా చదవండి :




