Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanu Man: దిల్ రాజు దెబ్బకు.. హనుమాన్ వెనక్కు..? అసలు మ్యాటర్ ఏంటంటే

ఈసారి సంక్రాంతి రేసులో ఐదు భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్దం కావడం వివాదాస్పదంగా మారింది. గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, హనుమాన్, నా సామిరంగ సినిమాలు రావడంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది. నిర్మాతలెవరూ వెనక్కి తగ్గకపోవడంతో సంక్రాంతి సినిమాల వివాదంపై నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు.

Hanu Man: దిల్ రాజు దెబ్బకు.. హనుమాన్ వెనక్కు..? అసలు మ్యాటర్ ఏంటంటే
Dil Raju
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 26, 2023 | 4:08 PM

ఈసారి పెద్ద పండగకు భారీ సినిమాలు సందడి చేయనున్నాయి. సంక్రాంతిని టార్గెట్ చేసుకొని చాలా సినిమాలు బరిలోకి దుకానున్నాయి. ఈసారి సంక్రాంతి రేసులో ఐదు భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్దం కావడం వివాదాస్పదంగా మారింది. గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, హనుమాన్, నా సామిరంగ సినిమాలు రావడంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది. నిర్మాతలెవరూ వెనక్కి తగ్గకపోవడంతో సంక్రాంతి సినిమాల వివాదంపై నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్​లో ఆ ఐదు సినిమాల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు.

సంక్రాంతి రేసు నుంచి రెండు సినిమాలు తప్పుకుంటే థియేటర్లు సర్దుబాటు చేయడం సులభం అవుతుందని.. అలా తప్పుకున్నవారికి తర్వాత సోలో రిలీజ్ డేట్ చాంబర్ తరఫున ఇస్తామని ఐదుగురు నిర్మాతలకు చెప్పినట్టు దిల్‌ రాజు వెల్లడించారు. గుంటూరు కారం నిర్మాతలు మినహా మిగతా నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు దిల్ రాజు.

సంక్రాంతికి ఐదు చిత్రాలు విడుదలైతే ఏ సినిమాకూ న్యాయం జరగదన్నారు దిల్ రాజు. అలాగే టాలీవుడ్ ఇంటస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశామని, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు దిల్‌ రాజు. అయితే దిల్ రాజు సలహా మేరకు హనుమాన్ మూవీ టీమ్ వెనక్కి తగ్గనుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్ , ట్రైలర్ వరకు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చాలా మంది ఈ సినిమా సోలో రిలీజ్ అవ్వడమే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు కూడా హనుమాన్ మూవీ మేకర్స్ తో సంప్రదింపులు జరిపారని టాక్. మరి హనుమాన్ వాయిదా పడుతుందా లేక సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అన్నది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.