Tollywood : భర్తతో విడాకుల రూమర్స్.. ఇంటి పేరు మార్చుకున్న టాలీవుడ్ హీరోయిన్..
సినీరంగంలో విడాకులు అనేది సర్వసాధారణమయ్యాయి. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతో మంది సెలబ్రెటీ జంటలు డివోర్స్ తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. గత కొన్నాళ్లుగా ఆమె తన భర్తతో వేరుగా ఉంటుందని.. త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఇంటి పేరు మార్చుకుంది.

ప్రస్తుతం సినీరంగంలో ఓ హీరోయిన్ పేరు మారుమోగుతుంది. త్వరలోనే ఆమె తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె తన ఇంటి పేరు మార్చుకోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ హన్సిక మోత్వానీ. అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో కథానాయికగా పరిచయమైన హన్సిక… ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా చక్రం తిప్పిన ఈ ముద్దుగుమ్మ.. 2022లో వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత బుల్లితెరపై పలు షోలలో పాల్గొంది. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా వీరిద్దరి విడాకుల విషయం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లైన కొద్ది కాలానికే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని టాక్ నడిచింది. ఇక ఇప్పుడు హన్సిక వ్యక్తిగత విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
కొన్ని రోజులుగా హన్సిక మోత్వానీ, సోహైల్ కతురియా విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో తన ఇన్ స్టాలో ఇంటి పేరు మార్చుకుంది హన్సిక. దీంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఇంటి పేరులను మోత్వాని స్పెల్లింగ్ మార్చింది. న్యూమరాలజీ ఆధారంగా తన ఇంటి పేరులో స్పెల్లింగ్ మార్చుకుంది. అంటే ఆమె ఇంటి పేరును ‘Motwani’ నుంచి Motwanni గా మార్చుకుంది. సాధారణంగా సెలబ్రెటీలు న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ఇప్పటికే చాలా మంది సినీతారలు న్యూమరాలజీ ఆధారంగా తమ పేర్లను మార్చుకున్న సంగతి తెలిసిందే. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన హాన్సిక.. షక లక బూమ్ బూమ్ వంటి హిట్ సీరియల్స్ చేసింది. అలాగే హృతిక్ రోషన్ నటించిన కోయి మిల్ గయా చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. 2007లో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. హన్సిక, సోహైల్ కతురియా వివాహం జియో హాట్ స్టార్ లో లవ్ షాదీ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ గా విడుదలైంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




