Jyothi Rai: త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న ‘గుప్పెడంత మనసు’ జగతి.. అతడితో ఫోటో షేర్ చేస్తూ హింట్..
గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాయ్ పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె గురించి గత రెండు నెలలుగా ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. పెళ్లయి అప్పటికే ఓ బాబు ఉన్న జ్యోతిరాయ్ ఓ యంగ్ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. సీరియల్లో సంప్రదాయ చీరకట్టులో పెద్ద బొట్టుతో రిషి అమ్మగా ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తూ తన నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న జ్యోతి రాయ్ ఇన్ స్టాలో మాత్రం ఫుల్ యాక్టివ్.

బుల్లితెరపై కార్తీక దీపం తర్వాత ఆరేంజ్లో ప్రేక్షకాదరణ అందుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్లో రిషి, వసూధార, మహేంద్ర, జగతి, దేవయాని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా రిషి, వసూధార, జగతి ఈ ముగ్గురికి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు తెలుగు ప్రేక్షకులకు వీరు ఎంతగా చేరువయ్యారో. అయితే గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాయ్ పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె గురించి గత రెండు నెలలుగా ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. పెళ్లయి అప్పటికే ఓ బాబు ఉన్న జ్యోతిరాయ్ ఓ యంగ్ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
సీరియల్లో సంప్రదాయ చీరకట్టులో పెద్ద బొట్టుతో రిషి అమ్మగా ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తూ తన నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న జ్యోతి రాయ్ ఇన్ స్టాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్స్ కు టచ్ లో ఉంటుంది. ఇక జ్యోతిరాయ్ ఇన్ స్టా లో షేర్ చేసే పిక్స్ గురించి చెప్పక్కర్లేదు. గుప్పెడంత మనసు జగతి.. లేదా జ్యోతిరాయ్ అంటూ గుర్తుపట్టడం కష్టమే అవుతుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో నెట్టింట గ్లామర్ రచ్చ చేస్తుంటుంది. ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు జ్యోతిరాయ్ ఓ గుడ్ న్యూస్ పంచుకోబోతున్నారట.




View this post on Instagram
కొద్ది రోజులుగా ఆమె యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్ అనే యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఇక ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా జ్యోతి రాయ్ ఇన్ స్టాలోనూ అతడితో దిగిన సెల్ఫీస్ షేర్ చేసింది. ఇక ఇటీవల ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన ఆమె.. ఏకంగా దర్శకుడి పేరును తన యూజర్ పేరులో పెట్టేసుకుంది. దీంతో ఆమె రిలేషన్ కన్ఫార్మ్ అని మరోసారి వార్తలు నడిచాయి. ఇక ఇప్పుడు అతడితో కలిసున్న ఫోటో షేర్ చేస్తూ త్వరలోనే గుడ్ న్యూస్..అంటూ క్యాప్షన్ ఇచ్చింది జ్యోతిరాయ్. దీంతో వీరిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారా ? లేదా ఇప్పటికే పెళ్లి జరిగిపోయిందా ? ఏదైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. జ్యోతికి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. కన్నడలో 20కి పైగా సీరియల్స్, పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసిన జ్యోతిరాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.