ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటను మరిపించేలా జస్ట్ ఓ సాంగ్ చేస్తే చాలు.. వార్2 షూటింగ్ పూర్తయిపోతుంది.
దాని కోసం స్పెషల్‌గానే ప్రిపేర్ అవుతున్నారు హృతిక్ అండ్ తారక్. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరి స్ట్రెంగ్త్‌ని ఇంకొకరు ప్రస్తావిస్తూ, సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు.
వార్2 షూటింగ్ ఇలా కంప్లీట్ అవుతుందో లేదో వెంటనే క్రిష్ 4 పనులను స్టార్ట్ చేసేస్తారు హృతిక్ రోషన్.
ఈ సినిమా కోసం ఆయన ఒకటి, రెండూ కాదు.. నాలుగు రోల్స్ ప్లే చేయాలి. హీరో, విలన్ ప్లస్ ఇంకో కేరక్టర్.. ఇవి స్క్రీన్ ముందు కనిపించేవి..
కెమెరా వెనుక డైరక్టర్‌గా ఇంకో యాంగిల్.. సో.. దేనికదే టఫ్ అయిందేనన్నమాట. అవును క్రిష్ 4 డైరెక్షన్ ఆయనే చూస్తున్నారు.
డైరక్షన్ గురించి ఆలోచిస్తే భయంగా ఉందన్నారు హృతిక్. దర్శకత్వం మామూలు విషయం కాదు, ఎన్నో విషయాల మీద లోతుగా అవగాహన పెంచుకోవాలి.
ఎంతో మందిని కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఎక్కడ చిన్న తేడా జరిగినా, విమర్శలు దారుణంగా ఉంటాయి.
భవిష్యత్తులో ఇలాంటివాటన్నిటినీ ఫేస్ చేయగలననే నమ్మకం కుదిరాకే మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యానని అంటున్నారు హృతిక్.