అనేక వాయిదాల తర్వాత విజయోత్సవం.. పుష్ప 2 సక్సెస్ స్టోరీ..

అనేక వాయిదాల తర్వాత విజయోత్సవం.. పుష్ప 2 సక్సెస్ స్టోరీ..

image

13 April 2025

Prudvi Battula 

2021 డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 1 ది రైజ్ సినిమా విడుదలై పాన్ ఇండియా రేంజ్‎లో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

2021 డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 1 ది రైజ్ సినిమా విడుదలై పాన్ ఇండియా రేంజ్‎లో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

దీని కొనసాగింపుగా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ సినిమా 2022లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని టీం అనుకుంది.

దీని కొనసాగింపుగా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ సినిమా 2022లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని టీం అనుకుంది.

కానీ కోవిడ్ 19 సెకండ్ వేవ్ లొక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ మొదలు కాకపోవడం మాత్రమే కాదు అనౌన్స్‌మెంట్ కూడా అవలేదు.

కానీ కోవిడ్ 19 సెకండ్ వేవ్ లొక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ మొదలు కాకపోవడం మాత్రమే కాదు అనౌన్స్‌మెంట్ కూడా అవలేదు.

దీంతో ఏప్రిల్ 8 2023న అల్లు అర్జున్ పుట్టినరోజు పురస్కరించుకొని మూవీ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ వీడియో విడుదల చేసారు మేకర్స్.

ఈ సినిమా గత ఏడాది డిసెంబర్‎లోనే విడుదల అవుతుంది అనుకొన్నారు అభిమానులు. అయితే షూటింగ్ ఆలస్యం అవడంతో అది జరగలేదు.

తర్వాత 2024 ఆగష్టు 15న పుష్ప సినిమా విడుదలకు ప్లాన్ చేసారు మేకర్స్. దీంతో అదే ఏడాది ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజుకి టీజర్ రిలీజ్ చేసారు.

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో మరోసారి వాయిదా పడింది. డిసెంబర్ 6 2024న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

తర్వాత కొన్ని రోజులకి డిసెంబర్ 5కి ఈ సినిమా విడుదలను ప్రీపోన్ చేసారు మూవీ మేకర్స్. చివరికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ.