AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇప్పటివరకు ఏ బ్రాండ్ ప్రమోట్ చేయని ఏకైక హీరో.. ఇప్పటివరకు రూ.430 కోట్లకు పైగా ఆస్తి కలిగిన హీరో..

మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోస్ ఏదోక బ్రాండ్ ప్రచారకర్తగా వ్యవహరించిన వాళ్లే. కానీ మీకు తెలుసా ?. సౌత్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ఇప్పటివరకు ఏ బ్రాండ్ ను ప్రమోట్ చేయలేదు. కానీ ఆయన సినిమా విడుదలైతే మాత్రం కోట్లల్లో వసూళు రాబడతారు. ఎవరో తెలుసా ?.

Tollywood: ఇప్పటివరకు ఏ బ్రాండ్ ప్రమోట్ చేయని ఏకైక హీరో.. ఇప్పటివరకు రూ.430 కోట్లకు పైగా ఆస్తి కలిగిన హీరో..
Tollywood
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2023 | 10:44 AM

Share

సాధారణంగా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఏదో ప్రకటన చేస్తూనే ఉంటారు. ఇక ఫేమస్ సెలబ్రెటీస్ తో తమ కంపెనీ బ్రాండ్ యాడ్స్ చేయడానికి వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోస్ ఏదోక బ్రాండ్ ప్రచారకర్తగా వ్యవహరించిన వాళ్లే. కానీ మీకు తెలుసా ?. సౌత్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ఇప్పటివరకు ఏ బ్రాండ్ ను ప్రమోట్ చేయలేదు. కానీ ఆయన సినిమా విడుదలైతే మాత్రం కోట్లల్లో వసూళు రాబడతారు. ఎవరో తెలుసా ?. అతనే సూపర్ స్టార్ రజినీకాంత్. 72 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ అగ్రకథానాయకుడిగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న రజినీ ఇటీవల జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాడు. దక్షిణాదిలో రజినీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో రజినీ తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు.

1975లో తమిళ్ చిత్రం అపూర్వ రాగంగల్ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఈ మూవీ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఎన్నో కోట్లు సంపాదించిన రజినీ.. ఇప్పటికీ సింపుల్ లైఫ్ గడిపేందుకు ఇష్టపడతారు. రజినీ ఆస్తి విలువ రూ.430 కోట్లు. కానీ ఇప్పటివరకు ఆయన ఏ బ్రాండ్ చేయలేదు. సౌత్ ఇండస్ట్రీలో ఏ బ్రాండ్ ప్రమోట్ చేయని ఏకైక హీరో రజిని మాత్రమే.

ఇవి కూడా చదవండి

మొదట్లో రజినీ ఒక్క సినిమాకు రూ.30 వేలు వసూలు చేసేవారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా వసూళు చేస్తున్నారు. జైలర్ చిత్రానిగానూ రజినీ రూ.110 కోట్లు తీసుకున్నారని సమాచారం. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఆయనకు అన్ని రకాల సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఇల్లు ఉంది. దాని ఖరీదు దాదాపు రూ.35 కోట్లు. అలాగే ఆయనకు సొంతగా ఓ కళ్యాణ మండపం ఉంది. అందులో దాదాపు 1000 మందికి పైగా అతిథులకు ఆహ్వానం పలకవచ్చు. ఈ ప్రాపర్టీ ధర రూ.10 నుంచి 20 కోట్లు ఉంటుందని అంచనా.

View this post on Instagram

A post shared by Rajinikanth (@rajinikanth)

ఇక రజినీకి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన వద్ద రెండు రోల్స్ రాయిస్ కార్స్ ఉన్నాయి. మొదటి రోల్స్ రాయిస్ ఘోస్ట్ ధర రూ.6 కోట్లు. రెండవది రోల్స్ రాయిస్ ఫాంటమ్. దీని ధర రూ.16.5 కోట్లు. ఇవి కాకుండా రజినీ వద్ద రూ.2 కోట్లు విలువైన Mercedes-Benz G Wagon, రూ.3.10 కోట్లు విలువైన లంబోర్గినీ ఉరుస్ ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా