AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JrNTR: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల.. ఢిల్లీ వెళ్లలేకపోయిన ఎన్టీఆర్.. కారణమేంటంటే..

సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగే కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది దాకా అతిథులు పాల్గొననున్నట్లు సమాచారం.

JrNTR: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల.. ఢిల్లీ వెళ్లలేకపోయిన ఎన్టీఆర్.. కారణమేంటంటే..
Jr.ntr
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2023 | 10:28 AM

Share

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత, సీనియర్ నటుడు తారక రామారావు శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని కేంద్రం ముద్రించిన సంగతి తెలిసిందే. సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగే కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు,

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణతోపాటు నందమూరి కుటుంబసభ్యులు ఇప్పటికే ఢీల్లీకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు దాదాపు 200 మంది దాకా అతిథులు పాల్గొననున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

అలాగే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీఆర్ వెన్నెటి ఉన్న అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కుంభంపాటి రామ్మోహన్ రావు, ఎద్దుపల్లి సుబ్రహ్మణ్యం, దగ్గుబాటి సురేశ్, విజ్ఞాన్ విద్యాసంస్తల అధినేత రత్తయ్య కూడా హజరుకానున్నారు. అయితే తనకు ఆహ్వానం అందకపోవడంపై రాష్ట్రపతికి లేఖ రాశారు లక్ష్మీ పార్విత. ఆహ్వానితుల జాబితాలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేకపోయారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా స్మారక వంద నాణెం విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం రాగా.. దేవర షూటింగ్ కారణంగా ఢిల్లీ వెళ్లలేకపోయారు తారక్.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం దేవర. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

చాలా కాలం తర్వాత  ఇందులో తారక్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. అయితే ఇటీవల వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.