AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: చంద్రుడిపై రూ.6,300 కోట్ల ఆస్తి కలిగి ఉన్న స్టార్ హీరో.. ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే..

విక్రమ్ ల్యాండర్ లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజకల్ ఎక్స్ పరిమెంట్ పేలోడు చందమామ ఉపరితలంపై కాస్త లోతులో సేకరించిన ఉష్రోగ్రతలను గ్రాఫ్ రూపంలో వెల్లడించింది. చంద్రుడి ఉపరితలపై సుమారు 50 డిగ్రీల ఉషోగ్రత ఉందని.. అదే 80 మిల్లీ మీటర్ల లోతులో దాదాపు రూ.10 డిగ్రీలుగా ఉందని చూపించింది. ఇక జాబిల్లిపై దక్షిణ ధ్రువంలో ఉష్ణోగ్రతలు, వాతావరణంకు సంబంధించిన వివరాలను ఇస్రో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది.

Chandrayaan 3: చంద్రుడిపై రూ.6,300 కోట్ల ఆస్తి కలిగి ఉన్న స్టార్ హీరో.. ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే..
Chandrayaan 3
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2023 | 8:55 AM

Share

చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన సంగతి తెలిసిందే. జాబిల్లి ఉపరితలపై దక్షిణ ధ్రువానికి దగ్గరగా మిషన్ రోవర్ ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పటికే జాబిల్లి పైకి చేరిన రోవర్ తన పని మొదలుపెట్టింది. విక్రమ్ ల్యాండర్ లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజకల్ ఎక్స్ పరిమెంట్ పేలోడు చందమామ ఉపరితలంపై కాస్త లోతులో సేకరించిన ఉష్రోగ్రతలను గ్రాఫ్ రూపంలో వెల్లడించింది. చంద్రుడి ఉపరితలపై సుమారు 50 డిగ్రీల ఉషోగ్రత ఉందని.. అదే 80 మిల్లీ మీటర్ల లోతులో దాదాపు రూ.10 డిగ్రీలుగా ఉందని చూపించింది. ఇక జాబిల్లిపై దక్షిణ ధ్రువంలో ఉష్ణోగ్రతలు, వాతావరణంకు సంబంధించిన వివరాలను ఇస్రో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. ఇక దీనిపై పూర్తి స్థాయి పరిశీలనలు జరుగుతున్నాయని తెలిపింది.

ఇదిలా ఉంటే.. మరోవైపు చంద్రుడి పై రియల్ ఎస్టేట్ ఇప్పుడే షూరు అయ్యింది. ఇప్పటికే గోదావరి ఖని జిల్లాకు చెందిన సుద్దాల సాయి విజ్ఞత తన తల్లి పేరుతో చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసింది. 2022 మార్చి 8న చంద్రుడిపై తన తల్లి వకుళా దేవి, కుమార్తె ఆర్హ పేరు మీద ఒక ఎకరం భూమి కొనుగోలుకు లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా.. ఈనెల 23న చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండర్ సేఫ్ గా దిగిన రోజునే లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ సంస్థ.. సాయి విజ్ఞత కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయింది. అయితే ఇప్పుడు చంద్రుడిపై ఓ స్టార్ హీరో ఏకంగా రూ.6.300 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నాడనే వార్త వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

డీఎన్ఏ ప్రకారం చంద్రుని ఉపరితలంపై ఒక ఎకరం భూమి ధర సుమారు $42.5 (సుమారు రూ. 3,512), అయితే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చంద్రునిపై కోరిన ప్రదేశంలో (సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని పిలుస్తారు) అనేక ఎకరాలను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. 2009లో జీన్యూస్ తో జరిగిన ఇంటర్వ్యూలో షారుఖ్ ఈ వార్తలను ధృవీకరించారు. “ఒక ఆస్ట్రేలియన్ మహిళ నా పుట్టినరోజున ప్రతి సంవత్సరం నాకోసం చంద్రుడిపై కొంచెం భూమిని కొనుగోలు చేస్తుంది. ఆమె కొంతకాలంగా దానిని కొనుగోలు చేస్తుంది. లూనార్ రిపబ్లిక్ సొసైటీ నుంచి అందుకు సంబంధించిన ధృవపత్రాలను పొందాను. ఆమె ఎప్పుడూ నాకు రంగురంగులలో ఇమెయిల్స్ రాస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజల ప్రేమను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చాడు షారుఖ్. ఇటీవల తన 52వ పుట్టినరోజున చంద్రుని ఉపరితలంలపై భూమిని పొందడంతోపాటు.. చంద్రునిపై భూమి కలిగిన మొట్ట మొదటి భారతీయన నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు షారుఖ్.

అలాగే షారుఖ్ తోపాటు.. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సైతం చంద్రుడిపై భూమి ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు రూ.55 లక్షలకు చంద్రునికి అవతలి వైపున ఉన్న మారే ముస్కోవియన్స్ లేదా సీ ఆఫ్ మస్కోవి అనే భూమిని సుశాంత్ కొనుగోలు చేశారు.అలాగే బిగ్ బాస్ 16లో పాల్గొన్న అంకిత్ గుప్తా, ప్రియాంక చాహర్ చౌదరికి ఒక అభిమాని చంద్రునిపై ఎకరం భూమిని బహుమతిగా ఇచ్చాడు. వీరితోపాటు.. జాన్ ట్రావోల్టా, నికోల్ కిడ్మాన్, బార్బరా వాల్టర్స్, టామ్ క్రూజ్ వంటి ఇతర ప్రముఖులు కూడా చంద్రుడిపై భూమిని కలిగి ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.