చెట్టెక్కిన సల్మాన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
14 April 2025
Prudvi Battula
చెట్టులెక్కగలడూ.. మా సల్మాన్ పుట్టలెక్కగలడూ అంటూ పాటలో లిరిక్స్ ని స్లైట్‌గా చేంజ్ చేసేయాలేమో... ఎందకంటే ఆయన చెట్టెక్కి చూపించారు.
షష్టిపూర్తికి దగ్గరపడుతున్న సమయంలో అంత ఈజీగా చెట్టెలా ఎక్కేశావు గురూ.. అని ఆశ్చర్యపోతున్నారు సల్మాన్‌ని చూసిన వారందరూ.
కండల వీరుడి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫిట్‌నెస్ అంటే అలాగే ఉంటుంది మరి అంటూ ఆయన సైడ్ తీసుకుంటున్నారు ఇంకొందరు.
ఫార్మ్ హౌస్‌లో సేద దీరుతున్న సల్మాన్, చెట్టెక్కి మల్బరీ పండ్లను రాల్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
శుభ్రంగా హిట్ సినిమాలు తీయమంటే ఇదేం పని సల్మాన్ అంటూ కాస్త వెటకారంగా అంటున్నవారూ లేకపోలేదనుకోండి..
రీసెంట్ సికందర్ ఫ్లాప్ కావడంతో ఇలాంటి మాటలు వినక తప్పడం లేదు. నెక్స్ట్ అట్లీతో అనుకున్న సినిమా ఆగిపోవడంతో కాస్త గ్యాప్ దొరికింది సల్మాన్‌కి.
ఈ ఖాళీ సమయాన్ని కథలు వినడానికి వాడుకుంటున్నారట సల్మాన్. ఈ సారైనా పక్కా స్టోరీని సెలక్ట్ చేసుకో బాస్ అంటూ రిక్వెస్టులు అందుతున్నాయి ఫ్యాన్స్ నుంచి.
ఈ మధ్య సల్మాన్ సినిమాలు ఏవి అంతగా వర్కౌట్ కావడం లేదు. అందుకే ఫ్యాన్స్ ఇలా ఆడుతున్నారు. ఇంతకీ సల్మాన్‌కి ఈ మాటలు వినిపిస్తున్నట్టేనా?
మరిన్ని వెబ్ స్టోరీస్
అనేక వాయిదాల తర్వాత విజయోత్సవం.. పుష్ప 2 సక్సెస్ స్టోరీ..
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్.. 6 రెబల్ స్టార్‌వే..
పవన్ మూవీలో ఆ పాట అంటే నాకు ఎంతో ఇష్టం: డార్లింగ్..