జ్ఞానవంతుడి సీక్రెట్ ఇదే..! కష్టాలు రావొద్దంటే విదురుడి మాట వినండి..!
మహాభారతంలో విదురుడు చెప్పిన మంచి మాటలు విదుర నీతిగా ఇప్పటికీ మనకు ఉపయోగపడుతున్నాయి. తెలివిగా, మంచిగా, నీతిగా ఎలా బ్రతకాలో ఆయన చెప్పిన సూచనలు అందరికీ స్ఫూర్తిని ఇస్తాయి. విదురుడు చెప్పిన జీవిత సూత్రాలు మన జీవితాన్ని విజయవంతంగా మార్చే మార్గాన్ని చూపుతాయి.

మహాభారతంలో ఒక ప్రత్యేకమైన భాగం విదుర నీతిగా ప్రసిద్ధి చెందింది. ఇది మహారాజు ధృతరాష్ట్ర, మహాత్మా విదుర మధ్య జరిగిన సంభాషణపై ఆధారపడి ఉంటుంది. ఈ నీతి మన జీవితంలో అనేక ముఖ్యమైన పాఠాలను తెలియజేస్తుంది.. ఇవి మన జీవితాన్ని శాంతియుతంగా, సుఖంగా గడపడానికి మార్గదర్శకం కావచ్చు. మహాత్మా విదురుడు మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తి.. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ చాలా విలువైనవిగా ఉన్నాయి.
విదుర నీతి ప్రకారం తెలివైన మనిషి జీవితం డబ్బు, ఆరోగ్యం లేదా వాతావరణం వల్ల మారదు. ఉదాహరణకి సీజన్ల మార్పులు, వేసవి, శీతాకాలం, గ్రీష్మ కాలం వంటి వాతావరణ మార్పులు జ్ఞానవంతుడి జీవితంపై ఎటువంటి ప్రభావం చూపవు. ఆయన ఎప్పుడూ తన పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాడు. వాతావరణం మంచిగా ఉన్నా.. బాగా లేకున్నా.. ఆయన చేసే పని మాత్రం ఆగదు. ఇవన్నీ ఆయన ఆలోచనలకు అడ్డురావు.
తెలివైన మనిషి జీవితంలో ప్రేమ, భయం కూడా ఏమీ చేయలేవు. మామూలుగా అయితే మనం ఎవరినైనా ప్రేమిస్తే ఒకలా, ద్వేషిస్తే ఇంకోలా ప్రవర్తిస్తాం. కానీ జ్ఞానవంతుడు మాత్రం ప్రేమ ఉన్నా.. ద్వేషం ఉన్నా తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఆయన స్వచ్ఛమైన మనసుతో భయం లేకుండా తన పనులు చేస్తాడు. ఎప్పుడూ తన సొంత ఆలోచనలు, పద్ధతుల ప్రకారమే నడుచుకుంటాడు.
తెలివైన మనిషికి డబ్బు ఉన్నా లేకున్నా ఒకటే. మహాత్మా విదురుడు డబ్బుకు అంత విలువ ఇవ్వలేదు. అది మనకు మంచి పాఠం నేర్పుతుంది. మనకు కావాల్సిన బలం, శక్తి ఏదో విధంగా సంపాదించుకోవచ్చు. కానీ డబ్బు కోసం మరీ ఎక్కువ కష్టపడి మన టైమ్, శక్తిని వేస్ట్ చేసుకోవద్దు.
విదుర నీతి చెప్పే ఈ మూడు ముఖ్యమైన విషయాలు తెలివైన మనిషికి ఉండే లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు జీవితంలో పెద్దగా కష్టాలు, అడ్డంకులు లేకుండా చూసుకుంటారు. వాళ్ల జీవితం ఎప్పుడూ మంచిగా, తెలివిగా, ప్రశాంతంగా, విజయవంతంగా సాగుతుంది.