స్కూల్ డ్రస్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారుల్లో ఓ క్రేజీ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టారా..?

హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.

స్కూల్ డ్రస్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారుల్లో ఓ క్రేజీ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టారా..?
Childhood Pic
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

May 31, 2022 | 7:42 PM

హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటికి అవకాశాలను ఆదుకుంటూ హీరోయిన్ గా రాణిస్తుంది ఓ ముద్దుగుమ్మ.. పైన కనిపిస్తున్న చిన్ననాటి ఫోటో ఆ  బ్యూటీదే. అందం అభినయంతో ఈ కుర్రది తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని కుర్ర గుండెల్లో స్థానం సంపాదించుకుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఫ్రెండ్స్ తో కలిసి స్కూల్ డ్రస్ లో ఫొటోకు ఫోజ్ ఇచ్చిన ఈ ముగ్గురిలో ఒకరు మనకు బాగా తెలిసిన హీరోయిన్.. ఆ అమ్మడు ఎవరంటే..

పైన కనిపిస్తున్న ముగ్గురు చిన్నారుల్లో ఎడమ వైపు ఉన్న చిన్నది ఎవరో కాదు అందాల భామ అమలా పాల్. ప్రేమ ఖైదీ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అమలా పాల్. ఆ తర్వాత సిద్ధార్థ్ నటించిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సింపుల్ లుక్స్ తో కుర్రాళ్ళ మనసు దోచేసింది అమలాపాల్. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ చిన్నదానికి ఆ తర్వాత తెలుగులోనూ అవకాశాలు క్యూ కట్టాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఆ తర్వాత వచ్చిన రఘువరన్ బీటెక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఆమె, కుడి ఎడమైతే వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరించింది అమలా పాల్. ఇదిలా ఉంటే అమలా పాల్ నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమా నేటికి 9 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu