నటనలో టాప్.. టాలీవుడ్‌లో తోప్.. ముద్దులొలుకుతున్న ఈ చిన్నారుల్లో ఓ స్టార్ హీరో ఉన్నాడు గుర్తుపట్టారా..?
పాలాభిషేకాలు , పూలాభిషేకాలు, కటౌట్లు అంటూ జాతరల చేస్తుంటారు. ఈ క్రేజ్ కు పైన కనిపిస్తున్న బుజ్జాయి ఇప్పుడు బాప్. స్టార్ హీరో అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అతడు.
హీరోలకు అభిమానులు ఉంటారు.. కానీ కొంతమంది లెక్కలేనత మంది డై హార్ట్ ఫాన్స్ ఉంటారు. తమ హీరో సినిమా వస్తుందంటే చాలు పండగే.. థియేటర్స్ ను పెళ్లి కూతురిలా ముస్తాబు చేస్తారు. పాలాభిషేకాలు , పూలాభిషేకాలు, కటౌట్లు అంటూ జాతరల చేస్తుంటారు. ఈ క్రేజ్ కు పైన కనిపిస్తున్న బుజ్జాయి ఇప్పుడు బాప్. స్టార్ హీరో అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అతడు. ఆ పేరు ఒక బ్రాండ్, అతని నటన ఎవ్వరూ అందుకోలేని శిఖరం, డాన్స్ నెక్స్ట్ లెవల్ ఇంతకు ఈ చిన్నారి ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ఈ స్టార్ హీరో డై హార్ట్ ఫ్యాన్స్ ఈజీగానే గుర్తుపట్టేస్తారు.. మరి మీరు గుర్తుపట్టారా..?
పై ఫొటోల్లో ముద్దులొలుకుతున్న చిన్నారుల్లో ఉన్నది ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అభిమానులు ముద్దుగా తారక్ అని పిలుచుకుంటూ ఉంటారు. తారక్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. నటనలో తారక్ ను కొట్టే వాళ్ళే లేరు అని చెప్పొచ్చు. రీసెంట్ గా తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తోంది. ఈ సినిమా కోసం అదిరిపోయే కథను రెడీ చేస్తున్నారు కొరటాల. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు తారక్.