AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhika Apte: ప్రతిభ చూసి కాదు, అవి చూసే ఆఫర్లు ఇస్తున్నారు.. రాధికా ఆప్టే సెన్సేషన్‌ కామెంట్స్‌..

నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలో నిలిచే వారిలో ముందు వరుసలో ఉంటారు హీరోయిన్‌ రాధిక ఆప్టే. వ్యక్తిగత జీవితానికి సంబంధించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఆమె చేసే వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్‌కే పూర్తిగా పరిమితమైన రాధిక.. తెలుగులో లెజెండ్‌, రక్త చరిత్ర..

Radhika Apte: ప్రతిభ చూసి కాదు, అవి చూసే ఆఫర్లు ఇస్తున్నారు.. రాధికా ఆప్టే సెన్సేషన్‌ కామెంట్స్‌..
Radhika Apte
Narender Vaitla
|

Updated on: Nov 12, 2022 | 3:58 PM

Share

నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలో నిలిచే వారిలో ముందు వరుసలో ఉంటారు హీరోయిన్‌ రాధిక ఆప్టే. వ్యక్తిగత జీవితానికి సంబంధించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఆమె చేసే వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్‌కే పూర్తిగా పరిమితమైన రాధిక.. తెలుగులో లెజెండ్‌, రక్త చరిత్ర వంటి చిత్రాలతో తెలుగు వారికి సైతం చేరువైంది. లయన్‌ చిత్రంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌ల విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది.

ప్రస్తుతం ఫిల్మ్‌ మేకర్స్‌ అంతా యంగ్‌ హీరోయిన్లనే తీసుకోవాలని భావిస్తున్నారన్న రాధికా.. ఈ కారణంగా తాను కొన్నిసార్లు ఆఫర్లు చేజార్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. హీరోయిన్లకు ఆఫర్లు రావడంలో వయసు కూడా ప్రభావాన్ని చూపిస్తోందన్న ఈ ముద్దుగుమ్మ.. కమర్షియల్‌ చిత్రాల్లో యంగ్‌ హీరోయిన్స్‌ని ఆఫర్లు రావడానికి ఇదే కారణమనని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌కు ఉండాల్సిన లక్షణాలు లేవనే కామెంట్స్‌ ఇండస్ట్రీలో కామన్‌గా మారాయి అని రాధిక తెలిపింది.

ఈ విషయమై రాధిక ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమాల్లో ఆఫర్ల కోసం సర్జరీలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ప్రతిభను కాకుండా ఫిజిక్‌ను బట్టి అవకాశాలివ్వడం ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఉంది. ఇప్పుడిప్పుడే దీనికి వ్యతిరేకంగా మహిళలు గళం విప్పుతున్నారు’ అని చెప్పుకొచ్చింది. ఇక రాధిక కెరీర్‌ విషయానికొస్తే ఆమె ప్రస్తుతం ‘మౌనికా ఓ మై డార్లింగ్‌’ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా విడుదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?