AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వాష్‌రూంలోంచి వింత శబ్ధాలు.. డోర్ ఓపెన్ చేసి చూడగా.. గుండె పగిలే సీన్

కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. డైనింగ్ రూమ్‌లో ఓ వ్యక్తికి భారీ కింగ్ కోబ్రా కనిపించింది. మొదట దాన్ని బెల్ట్ అనుకున్న ఆ వ్యక్తి దాన్ని తీసేందుకు వెళ్లగా.. అక్కడున్న భారీ కింగ్ కోబ్రా ఒక్కసారిగా అతని వైపు చూస్తూ బుసలు కొట్టింది. దీంతో భయపడిపోయిన ఆ వ్యక్తి వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: వాష్‌రూంలోంచి వింత శబ్ధాలు.. డోర్ ఓపెన్ చేసి చూడగా.. గుండె పగిలే సీన్
Kerala King Cobra Rescue
Anand T
|

Updated on: Oct 28, 2026 | 11:52 AM

Share

మీరు సాధారణంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే.. హఠాత్తుగా ఓ భారీ కింగ్ కోబ్రా మీ కళ్ల ముందు ప్రత్యక్షమై బుసలు కొడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా! అచ్చం ఇలాంటి అనుభవమే ఇక్కడో వ్యక్తికి ఎదురైంది. డైనింగ్ రూమ్‌లో కనిపించిన నల్లటి ఆకారాన్ని చూసి బెల్ట్ అనుకుని తీసేందుకు వెళ్లగా, అక్కడ భారీ రాచనాగు కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ఆ వ్యక్తి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అధికారులు చాకచక్యంగా దాన్ని పట్టుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని ఎరుమేలి సమీపంలోని ఏంజెల్ వ్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొంగంథానానికి చెందిన వర్గీస్ థామస్ అనే వ్యక్తి ఇంట్లో ఉండగా, అతనికి డైనింగ్ రూమ్‌లో ఏదో నల్లటి ఆకారం కనిపించింది. అది బెల్ట్ అయి ఉంటుందని భావించి దాన్ని తీద్దామని వర్గీస్ కిందకు వంగాడు. తీరా చూస్తే అక్కడున్నది ఓ భారీ రాచనాగు. వర్గీస్‌ను చూసిన ఆ పాము ఒక్కసారిగా పడగవిప్పి అతని వైపు చూస్తూ భీకరంగా బుసలు కొట్టడం మొదలుపెట్టింది.

దీంతో తీవ్ర భయాందోళనకు గురైన వర్గీస్ వెంటనే గదిలో నుంచి బయటకు పరుగులు తీసి, ఆ పాము బయటకు రాకుండా డోర్ లాక్ చేశాడు. ఆ తర్వాత ఇంట్లోని కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ముండక్కాయం ఫారెస్ట్ రేంజ్ అధికారులు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే అది భారీ రాచనాగు కావడంతో పట్టుకోవడం ప్రమాదకరమని గ్రహించి, వండంపాతల్ నుంచి ప్రత్యేక రాపిడ్ రెస్పాన్స్ (RR) బృందాన్ని రప్పించారు.

అక్కడికి చేరుకున్న రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఆ పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగగా, ఆ పాము వారి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న బాత్రూమ్‌లోకి, అక్కడి నుంచి బెడ్‌రూమ్‌లోకి దూరింది. చివరకు ఒక టేబుల్ కింద నక్కి ఉన్న ఆ భారీ రాచనాగును అధికారులు ఎంతో చాకచక్యంగా బంధించారు. ఇల్లు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో, ఉదయం పూట డోర్ తెరిచి ఉన్న సమయంలో ఈ భారీ పాము ఇంట్లోకి వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

తాజాగా పట్టుబడిన కింగ్ కోబ్రాతో పాటు, గత కొన్ని వారాలుగా జనావాసాల్లో పట్టుబడిన ఒక నాగుపాము, 13 కొండచిలువలను ఏంజెల్ వ్యాలీకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని గవి వద్దనున్న కక్కి డ్యామ్ సమీపంలోని దట్టమైన అడవుల్లోకి అధికారులు విడిచిపెట్టారు. దీంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us