AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

Phani CH
|

Updated on: Oct 28, 2026 | 11:59 AM

Share

ముంబయిలో సైకిల్‌పై ఇంటింటికీ పార్సెళ్లు డెలివరీ చేస్తున్న సుజీత్‌ అనే గిగ్‌ వర్కర్‌కు ఊహించని కానుక అందింది. ఆర్థిక ఇబ్బందులతో బైక్‌ కొనలేకపోతున్న అతడికి అనంత్‌ అంబానీ తరఫున కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బహుమతిగా ఇచ్చినట్లు వీడియోలో వెల్లడించారు. ఈ సర్‌ప్రైజ్‌తో సుజీత్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారగా, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వ్యాపారంలోనే సేవలోనూ శ్రీమంతుడే. ఎవరైనా కష్టంలో ఉన్నారని అతని దృష్టికి వస్తే వెంటనే స్పందించి వారికి తగిన సాయం చేస్తూ ఉంటారు. తాజాగా ఆర్థిక ఇబ్బందులతో బైక్ కొనుక్కోలేక, రోజూ సైకిల్‌పైనే ఇంటింటికీ తిరిగి పార్సెళ్లు డెలివరీ చేసే ఒక గిగ్ వర్కర్‌ జీవితంలో ఊహించని అద్భుతం జరిగింది. ముంబయికి చెందిన సుజీత్ అనే డెలివరీ ఏజెంట్ నిరుపేద కుటుంబం కావడంతో బైక్ కొనుక్కునే స్తోమత లేక, చాలీచాలనీ వేతనంతో కష్టపడుతూ సైకిల్‌పైనే విధులను నిర్వహిస్తున్నాడు. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో బండి కొనడం తన వల్ల కావడం లేదని ఆయన వాపోయాడు. ఈ క్రమంలో ముంబయికి చెందిన హుస్సేన్‌ మన్సూరి అనే ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సుజీత్‌ను పలకరించి, బైక్ ఎందుకు వాడటం లేదని అడిగాడు. తన పరిస్థితిని వివరించిన సుజీత్‌తో డెలివరీ పూర్తి చేసుకుని వచ్చి తనను కలవమని చెప్పారు. ఆయన తిరిగి రాగానే కళ్లకు గంతలు కట్టారు. అనంతరం అనంత్ అంబానీ తరఫున ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా అందజేశాడు. ‘అనంత్ సేవా ఫౌండేషన్’ చేపట్టిన ప్రత్యేక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ఈ-స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ఊహించని ఈ పరిణామానికి సుజీత్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు. ఆనందంతో మన్సూరిని హత్తుకుని తన కృతజ్ఞతలు తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కష్టపడే వ్యక్తికి అంబానీ చేసిన ఈ సహాయం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓడిన సర్పంచ్‌కి గ్రామస్తులు సత్కారం!

WhatsApp: వాట్సాప్ నుంచే ఇన్‌స్టా రీల్స్ షేర్.. అదిరిపోయే కొత్త ఫీచర్!

దీపావళికి ముఖం పాడవుతుందా? ఈ 5 టిప్స్ మిస్ అయితే నష్టపోతారు!

ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పుడుతూనే మీసాలతో పుట్టాడుగా!

‘ఎక్స్‌’లో అదిరిపోయే ఫీచర్.. ఒక్క లైక్‌తో నేరుగా డబ్బులు పంపొచ్చు!

Follow Us