AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓడిన సర్పంచ్‌కి గ్రామస్తులు సత్కారం!

ఓడిన సర్పంచ్‌కి గ్రామస్తులు సత్కారం!

Phani CH
|

Updated on: Oct 28, 2026 | 11:57 AM

Share

రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా భదౌరా గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికల్లో ఓడిపోయిన చిడి దేవికి గ్రామస్థులు అరుదైన గౌరవం ఇచ్చారు. కేవలం 162 ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఆమెకు ఊరంతా కలిసి రూ.25 లక్షలు సేకరించి కానుకగా అందించారు. గతంలో ఆమె భర్త హేమారామ్‌ రావు గ్రామానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. గెలుపోటముల కంటే గ్రామ ఐక్యత, సేవాభావమే ముఖ్యమని ఈ ఘటన చాటిచెప్పింది.

ఎన్నికలు అనగానే రాజకీయ వైరాలు, గెలిచినవారి హంగామా మాత్రమే గుర్తొస్తాయి. కానీ, రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా భదౌరా గ్రామంలో జరిగిన ఓ ఘటన గ్రామీణ ఐక్యతకు నిలువుటద్దంగా నిలిచింది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థికి గ్రామస్థులందరూ కలిసి రూ.25 లక్షల నగదును సేకరించి కానుకగా ఇచ్చి సత్కరించారు. భదౌరా గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సాధారణ రైతు కుటుంబానికి చెందిన చిడి దేవి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమెకు 1,155 ఓట్లు రాగా, కేవలం 162 ఓట్ల తేడాతో ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమితో మద్దతుదారులు నిరాశలో మునిగిపోగా, గ్రామస్థులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. “గెలుపోటముల కన్నా మన ఊరి ఐక్యతే ముఖ్యం” అని భావించి, ఊరంతా కలిసి రూ.25 లక్షల నిధిని సమకూర్చారు. ఆ సొమ్మును ఒక పళ్లెంలో ఉంచి, మేళతాళాల నడుమ ఊరేగింపుగా చిడి దేవి ఇంటికి తీసుకెళ్లారు. రాజకీయాల కంటే సేవా గుణానికే తాము విలువ ఇస్తామని చాటిచెప్పారు. చిడి దేవి భర్త హేమారామ్ రావు గతంలో తన సొంత డబ్బుతో గ్రామంలోని గోశాలకు ట్రాక్టర్ దానం చేయడమే కాకుండా, గ్రామస్థుల దాహార్తి తీర్చడానికి మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తుంచుకున్న ప్రజలు ఈ విధంగా తమ కృతజ్ఞతను చాటుకున్నారు. పదవి కంటే ప్రజల అభిమానమే గొప్పదని, ఈ ప్రేమ చూసి తమ బాధ గర్వంగా మారిందని ఆ కుటుంబం భావోద్వేగానికి గురైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

WhatsApp: వాట్సాప్ నుంచే ఇన్‌స్టా రీల్స్ షేర్.. అదిరిపోయే కొత్త ఫీచర్!

దీపావళికి ముఖం పాడవుతుందా? ఈ 5 టిప్స్ మిస్ అయితే నష్టపోతారు!

ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పుడుతూనే మీసాలతో పుట్టాడుగా!

‘ఎక్స్‌’లో అదిరిపోయే ఫీచర్.. ఒక్క లైక్‌తో నేరుగా డబ్బులు పంపొచ్చు!

Follow Us