AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా మాతో చాలా సరదగా ఉంటారు.. ఆయనకు అస్సలు కోపమే రాదు

ప్రముఖ నటుడు సుమన్, ఓ స్టార్ హీరోతో తన పని అనుభవాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని పంచుకున్నారు. అలాగే సెట్‌లో ఆ స్టార్ హీరో ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. షూటింగ్ ప్రారంభించే ముందు అందరూ భోజనం చేశారా లేదా అని ఆయన అడిగేవారని అన్నారు సుమన్.

అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా మాతో చాలా సరదగా ఉంటారు.. ఆయనకు అస్సలు కోపమే రాదు
Suman
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2026 | 12:04 PM

Share

ప్రముఖ నటుడు సుమన్, దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజుతో తన సుదీర్ఘ అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, పనితీరును ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఎన్‌.టి. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి దిగ్గజాలతో పాటు కృష్ణంరాజుతోనూ కలిసి పనిచేశానని సుమన్ తెలిపారు. ప్రతి ఒక్కరి నుంచీ ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, వారందరూ తనంటే చాలా ఇష్టపడి రిపీటెడ్‌గా అవకాశాలిచ్చారని ఆయన గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజుతో సుమన్ మొట్టమొదటి చిత్రం రారాజు. అప్పటికే హీరోగా స్థిరపడినప్పటికీ, కృష్ణంరాజు స్వయంగా పిలిచి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రను ఇచ్చారని, అది గెస్ట్ క్యారెక్టర్ లాంటిదే అయినా, కృష్ణంరాజుతో పని చేయాలనే ఆశతో చేశానని సుమన్ వివరించారు. ఆ చిత్రం షూటింగ్ ఊటీ దగ్గర ఫారెస్ట్‌లో జరిగిందని ఆయన గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజు గొప్ప వ్యక్తిత్వాన్ని సుమన్ కళ్ళకు కట్టారు. ఆయన సెట్‌కు రాగానే ముందుగా అందరూ భోజనం చేశారా లేదా, టిఫిన్ తిన్నారా లేదా అని అడిగేవారని, ఆ తర్వాత కాసేపు మాట్లాడి, 10 -10:30 గంటలకు షూటింగ్ మొదలుపెట్టేవారని సుమన్ చెప్పారు.

షూటింగ్ సమయంలో సీరియస్‌గా ఉన్నా, సీన్ అయిపోగానే మామూలుగా మారిపోయేవారని, 12:30 గంటలకల్లా బ్రేక్ ఇచ్చి అందరూ బాగా భోజనం చేయాలని ప్రోత్సహించేవారని సుమన్ వివరించారు. ముఖ్యంగా కృష్ణంరాజు భోజన ప్రియుడని, అనేక రకాల నాన్-వెజిటేరియన్ వంటకాలను తెప్పించుకునేవారని సుమన్ తెలిపారు. కృష్ణంరాజుతో ఒక షెడ్యూల్ పూర్తి చేస్తే ఖచ్చితంగా 5 కిలోల బరువు పెరిగేవాడినని సుమన్ సరదాగా చెప్పారు. ఆసక్తికరంగా, ఈ అలవాటును ప్రస్తుతం ప్రభాస్ కూడా పాటిస్తున్నారని విన్నానని సుమన్ పేర్కొన్నారు. సాయంత్రం 5:30-6 గంటలకల్లా “చాలయ్యా, చాలా కష్టపడ్డాం, రేపు చేద్దాం” అని చెప్పి షూటింగ్ ముగించే మెంటాలిటీ ఆయనదని సుమన్ వివరించారు. కృష్ణంరాజు పెద్ద స్టార్‌గా ఏమాత్రం ప్రవర్తించలేదని, అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉండేవారని సుమన్ కొనియాడారు. క్యారవాన్‌లు లేని అప్పటి రోజుల్లో అందరూ కలిసి కూర్చొని మాట్లాడేవారని చెప్పారు. కృష్ణంరాజుకు కార్లు అంటే చాలా ఇష్టమని, ఇంపోర్టెడ్ కార్ల గురించి తరచుగా తనతో మాట్లాడేవారని సుమన్ గుర్తుచేసుకున్నారు. ఆయనకు కోపం రావడం చాలా అరుదని, “ఎన్నిసార్లు చెప్పాలి నీకు” అనేది ఆయన హైయెస్ట్ కోపం అని సుమన్ చెప్పారు.

ఆహారానికి ఎంత ప్రాధాన్యతనిచ్చేవారో, ఫిట్‌నెస్‌కు కూడా కృష్ణంరాజు అంతే ప్రాముఖ్యతనిచ్చేవారని సుమన్ పేర్కొన్నారు. అవుట్‌డోర్ షూటింగ్‌లకు కూడా డంబెల్స్ వంటివి తీసుకువచ్చి, ఉదయం సాయంత్రం వ్యాయామం చేసేవారని, “ఎంత ఫుడ్ తీసుకుంటామో అంత ఎక్సర్‌సైజ్” అనే సూత్రాన్ని నమ్మేవారని తెలిపారు. ప్యాకప్ తర్వాత కూడా 15-20 నిమిషాలు వ్యాయామం చేసి తమ దగ్గరికి వచ్చేవారని సుమన్ వెల్లడించారు. చాలా ఫ్రెండ్లీగా, రిజర్వ్‌డ్‌గా కాకుండా, అందరికీ ఆయనే ముందుగా విష్ చేసి మాట్లాడేవారని, తన జీవిత అనుభవాలను, పైకి రావడానికి పడిన కష్టాలను తనతో పంచుకున్నారని సుమన్ గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజుతో సుమన్ బావ బావమరిది, లీడర్, నాయిడు గారి కుటుంబం వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి
Krishnam Raju

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us