అసలు సీతామహాలక్ష్మీ పాత్ర నాది కాదు.. ఇన్నాళ్టికి అసలు విషయం చెప్పిన మృణాల్ ఠాకూర్
తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో తన అభినయంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్. బుల్లితెరపై సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు కథానాయికగా తనదైన నటనతో హృదయాలను గెలుచుకున్న కథానాయిక మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ, నిత్యం తన నటనతో, గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి భామ. తొలి సినిమాతోనే తెలుగులో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. అందమైన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత మృణాల్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది మృణాల్.
ఈ క్రమంలోనే తెలుగులో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్, డెకాయిట్ సినిమాలతో పాటు ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోనూ చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక సీతారామం సినిమా విషయానికొస్తే .. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తన నటనతో మెప్పించాడు. అలాగే మెయిన్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, మరో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించి ఆకట్టుకున్నారు. కాగా ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్ర కోసం మృణాల్ ను సంప్రదించలేదట సంప్రదించలేదట. గతంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ..
సీతారామం సినిమాలో ముందు నన్ను అఫ్రిన్ ( రష్మిక పాత్ర )కోసం సంపాదించారట. మృణాల్ కు దర్శకుడు హను రాఘవపూడి కథ చెప్తున్న సమయంలో అఫ్రిన్ పాత్ర గురించే చెప్పారట.. కానీ కథ చెప్తున్నా సమయంలోనే ఆయన తన మనసు మార్చుకొని సీత పాత్ర చేయాలనీ కోరారట. అఫ్రిన్ పాత్ర కంటే తాను సీత పాత్రకు సరిగ్గా సరిపోతానని హను రాఘవపూడి భావించారట. అలా తన సీతామహాలక్ష్మీ పాత్ర వచ్చిందని మృణాల్ తెలిపారు. అలాగే సీతారామం సినిమాకు సీక్వెల్ కావాలని అభిమానులు కోరుతున్నారని, కానీ సినిమాకు అద్భుతమైన ఎండింగ్ వచ్చిందని, కాబట్టి సినిమాకు సీక్వెల్ లేదని మృణాల్ తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




