Tollywood: చూడగానే ముద్దొచ్చేస్తున్న ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి.. బూరె బుగ్గల బుజ్జాయి ఇప్పుడు కుర్రాళ్ల మనసులు దొచేసింది..
ఆ లిటిల్ క్యూటీ పై హీరోయిన్ మేఘా ఆకాష్. యంగ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
అమాయకపు చూపులతో చారడేసి కళ్లతో ముద్దులొలుకుతున్న ఆ బుజ్జాయి దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్. తెలుగు.. తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, టాలెంట్ ఉన్నా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం లేదు. చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ కు ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. వెండితెరపై సందడి చేయకపోయిన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఎవరో గుర్తుపట్టారా ?..
ఆ లిటిల్ క్యూటీ పై హీరోయిన్ మేఘా ఆకాష్. యంగ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చల్ మోహన్ రంగ, ప్రియమైన మేఘ సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించింది.
ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో ఐదు సినిమాలకు పైగానే ఉన్నాయి. అందులో మాస్ మాహారాజ రవితేజ నటిస్తోన్న రావణాసుర ఒకటి కాగా.. ప్రేమదేశం, గుర్తుందా శీతాకాలం, మను చరిత్ర వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.