Tollywood: ఫస్ట్ మూవీతోనే హృదయాలను దొచేసింది.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నది కూడా ఆ జాబితాలోకి చెందినవారే. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఎందుకో మరో అవకాశం రాలేదు. దీంతో ఇప్పటివరకు వేరే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయలేదు. గుర్తుపట్టరా ?..

తెలుగు తెరకు ఈ ఏడాది కొత్త ముద్దుగుమ్మలు పరిచయమైన సంగతి తెలిసిందే. తమిళ్, మలయాళం, కన్నడ భాషలకు చెందిన పలువురు హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో పలువురు తారలు సక్సెస్ అందుకోగా.. మరికొందరు డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకెళ్తుండగా.. అందం, అభినయంతో మెప్పించిన తారలు ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నది కూడా ఆ జాబితాలోకి చెందినవారే. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఎందుకో మరో అవకాశం రాలేదు. దీంతో ఇప్పటివరకు వేరే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయలేదు. గుర్తుపట్టరా ?.. ఇంతకీ తను ఎవరో.. తనే హీరోయిన్ మథిలా పాల్కర్.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మిథిలా పాల్కర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ టాక్ సొంతం చేసుకోగా… ఇందులో మిథిలా అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇందులో విశ్వక్ పొట్టి నూడుల్స్ అంటూ పిలవగా.. తెలుగు ప్రేక్షకులు, అభిమానులు సైతం ఈ తారను అదే పేరుతో గుర్తుంచుకున్నారు.




మిథిలా పాల్కర్.. ముంబైకి చెందిన అమ్మాయి. 1993లో జనవరి 11న జన్మించింది. 2014లో మజా హనీమూన్ అనే షార్ట్ ఫిల్మ్ లో తొలిసారిగా నటించింది.ఆ తర్వాత హిందీలో కత్తి బట్టి మూవీతో అడుగుపెట్టింది. హీందీలో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ చిన్నది తెలుగులో మాత్రం కేవలం ఒక్క సినిమా నే చేసింది. అయితే ఓరి దేవుడా సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు మిథిలా. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది… తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




